Viral Video: పులితో ఫోటో దిగుతున్న కుర్రాళ్ళకు ఊహించని షాక్.. క్షణాల్లోనే మారిపోయిన సీన్.. జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు..
ABN , First Publish Date - 2023-05-15T14:01:26+05:30 IST
అడవి జంతువులతో ఫోటోలు దిగడం, అందుకోసం వాటిని ఇబ్బంది పెట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇద్దరు కుర్రాళ్ళు బెంగాల్ టైగర్ తో ఫోటో దిగాలని చూస్తే..
ఈమధ్య కాలంలో జంతువుల దగ్గర ఫోటోలు తీసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పులులు, సింహాలతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గొప్పలు పోతుంటారు. అయితే ఇలా ఫోటోలు తీసుకోవడం వెనుక ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇద్దరు కుర్రాళ్లు సరదాగా బెంగాల్ టైగర్ తో ఫోటో దిగాలని అనుకున్నాడు. అయితే మన పులిరాజు కెమెరాకు అటెన్షన్ ఇవ్వలేదు. దీంతో వాళ్లు పులిని గెలికారు. అప్పటిదాకా సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ జరిగిందేంటో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పులులు, సింహాలతో ఫోటోలు, సెల్ఫీలు దిగడం ఈ మధ్య కాలలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే అలాంటి సమయాల్లో ప్రమాదాలు కూడా వెంట ఉంటాయి. థాయిలాండ్(Thailand) లో ఇద్దరు వ్యక్తులు The million years stone park& Pattaya crocodile farm కు వెళ్ళారు. అక్కడ బెంగాల్ టైగర్(Bengal tiger) తో ఫోటో దిగాలని అనుకున్నారు. వీడియోలో ఒక వ్యక్తి పులి పక్కన కూర్చుని ఉండగా.. మరొక వ్యక్తి అతని ప్రక్కన నిలబడుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ కెమెరాకు అటెన్షన్ ఇచ్చినా ఆ బెంగాల్ టైగర్ అనెన్షన్ ఇవ్వలేదు. అది అటూ ఇటూ తల తిప్పుతూ ఉండటంతో దాన్ని బంధించిన వారు ఒక పొడవాటి కర్ర(long stick) తీసుకుని పులిని కదిపారు. అంతే అప్పటిదాకా వెనుక ఇద్దరు వ్యక్తులున్నా పట్టించుకోకుండా తన మానాన తానున్న పులి ఒక్కసారిగా గాండ్రుమని అరిచింది(tiger roaring). ఆ అరుపుకు దాన్ని కర్రతో కదుపుతున్న వ్యక్తి కర్ర వదిలేసి పారిపోయాడు. అతను పారిపోవడం చూసి పులితో ఫోటో దిగాలని అనుకున్న కుర్రాళ్ళిద్దరూ కిందా మీదా పడుతూ అక్కడినుండి పరుగందుకున్నారు. ఓ కుర్రాడు లోపలినుండి బయటకు వచ్చి నేలమీద సాగిలపడి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వాళ్ళు లోపలి నుండి బయటకు వెళ్ళే సీన్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.
పేస్టు.. టూత్ బ్రష్ ఎక్కడ పెడుతుంటారు? బాత్రూమ్ లోనా? బయటా? తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేస్తున్నారో..
Hasna Zaroori Hai అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆశ్ఛర్యపోతుంటే మరికొందరు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరీ ముఖ్యంగా పులి పక్కన దానికి దగ్గరగా కూర్చోవాలని ప్రయత్నించిన కుర్రాడి విషయంలో ట్రోల్స్ ఎక్కువ ఉన్నాయి. అది పులి అన్నవిషయం అర్థమవుతోంది కదా వాళ్ల పిల్ల చేష్టలు ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. అది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదురా నాయనా.. అది అరిస్తేనే అరకిలోమీటర్ పరెత్తినంత సీన్ చేశారు.. ఇక మీవైపు ఓ చూపు చూస్తే ఏం చేసేవారో అని వెక్కిరిస్తున్నారు. అంత భయపడేవాళ్లు దాని దగ్గరకు ఎందుకెళ్లారు అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి కుర్రాళ్లు ఏదో యుద్దం నుండి బయటపడినంత ఫీలైపోయారు.