Viral: కాపాడండి.. అంటూ ఓ మహిళ అరుపులు.. పక్కింటి వ్యక్తి ఫోన్ చేస్తే క్షణాల్లో దిగిన పోలీసులు.. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-13T13:02:16+05:30 IST

పనులలో మునిహిపోయిన పొరుగింటివారికి హెల్ప్ మీ.. హెల్ప్ మీ.. అంటూ మహిళ అరుపులు వినిపించాయి. వారు పోలీసులకు కంప్లైంట్ చేస్తే..

Viral: కాపాడండి.. అంటూ ఓ మహిళ అరుపులు.. పక్కింటి వ్యక్తి ఫోన్ చేస్తే క్షణాల్లో దిగిన పోలీసులు.. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే..!

మహిళల మీద దారుణాలు పెట్రేగిపోతున్న కాలమిది. బయటకు వెళితే మహిళలకు రక్షణ లేదు అంటూ ఉంటారు. కానీ ఇంట్లో కూడా మహిళలకు రక్షణ తక్కువేనని పలు సంఘటనల్లో నిరూపితమవుతోంది. ఓ ఇంటివారు తమ ఇంట్లో పనులలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడే వారికి సడన్ గా హెల్ప్ మీ.. హెల్ప్ మీ.. అంటూ మహిళ అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వినగానే ఆ ఇంటివారు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఆ అరుపులు తమ పక్కింటి నుండి వస్తున్నాయని గ్రహించి షాక్యయారు. తరువాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగానే వారికి దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

యూకే(UK)లోని ఎసెక్స్ పోలీసులకు(Essex Police)ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'మా పక్కింట్లో ఒక మహిళ కాపాడండి.. కాపాడండి.. అంటూ సహాయం కోసం అరుస్తోంది. ఆమె ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తోంది' అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అది వినగానే ఎసెక్స్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. వారు మూడు పోలీసు కార్లలో ఫిర్యాదు చేసిన వారి లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకున్నారు. నేరుగా మిస్టర్ వుడ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్(Retired police officer) అయిన 54ఏళ్ళ మిస్టర్ ఉడ్ తలుపు తీసి ఎదురుగా పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యాన్ని గమనించి పోలీసులు నవ్వుతూ అతని ఇంట్లోకి తొంగిచూశారు. వెంటనే మిస్టర్ ఉడ్ పోలీసులతో 'నేనేం చేశాను? మీరు నా ఇంటికి ఎందుకొచ్చారు?' అని అయోమయంగా అడిగాడు . అప్పుడు పోలీసాఫీసర్ తమకు వచ్చిన ఫిర్యాదు గురించి చెప్పి 'మీ ఇంట్లో నుండి మహిళ కాపాడమని అరుస్తున్న శబ్ధాలు వస్తున్నాయట. మీ పక్కింటివారు ఫిర్యాదు చేశారు. మీ ఇల్లు తనిఖీ చెయ్యాలి'అని చెప్పాడు . ఆ మాట వినగానే మిస్టర్ ఉడ్ కు నవ్వొచ్చింది. ఆయన పోలీసులను సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు. లోపల సీన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు.

chilu.gif

Ambani Family: అంత పెద్ద ఇంద్రభవనంలో అన్నీ వదిలేసి.. 27వ అంతస్తులోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉండటం వెనుక..!


మిస్టర్ ఉడ్ ఇంట్లో 22 పెంపుడు చిలుకలు(22 pet Parrots) ఉన్నాయి. మిస్టర్ ఉడ్ పోలీసులను నేరుగా మూడేళ్ళ వయసు కలిగిన పసుపు రంగు చిలుక దగ్గరకు తీసుకెళ్ళాడు. 'ఇది అమెజాన్ చిలుక(Amazon parrot), దీని పేరు ఫ్రెడ్డీ, కాపాడండి.. కాపాడండి.. అని మహిళలా అరిచింది ఈ చిలుకే..' అని చెప్పాడు. పోలీసులు మిస్టర్ ఉడ్ మాటలకు ఆశ్చర్యపోయారు. కానీ ఆ తరువాత పోలీసులు నేరుగా ఆ చిలుక అరవడం(parrot screaming like women) చూసిన తరువాత నవ్వుకున్నారు. మిస్టర్ ఉడ్ దగ్గర రెండు అమెజాన్ చిలుకలు, ఎనిమిది ఇండియన్ రింగ్ నెక్ లు, ఆకుపచ్చ రెక్కలు కలిగిన మకావ్ లు, బ్లూ అండ్ గోల్డ్ రంగు మకావ్ లు, హాన్స్ మాకా, బడ్జీ అనే వైవిద్యమైన చిలుకలు ఉన్నాయి. ఇవన్నీ ఉదయం, సాయంత్రం సమయాలలో చాలా అల్లరిగా అరుస్తుంటాయట.

Viral Video: సింహాన్ని చూడగానే భయపడిన గున్న ఏనుగులు.. వెంటనే పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..


Updated Date - 2023-07-13T13:02:16+05:30 IST