Viral: ఇదేం పనమ్మా తల్లీ.. అందం కోసం ఇల్లు అమ్ముకోవడమేంటి..? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు డబ్బుల్లేక..!

ABN , First Publish Date - 2023-08-02T13:43:02+05:30 IST

ఈ భూమి మీద మనిషే శాశ్వతంగా ఉండడు. అలాంటిది వయసుతో పాటు తరిగిపోయే అందం గురించి తాపత్రయ పడటం వ్యర్థం. ఈ విషయాలు తెలిసినా చాలామంది అందంగా కనిపించడానికి తహతహలాడతారు. అందుకోసం లెక్కకు మిక్కిలి ప్రయత్నాలు చేస్తారు. ఈ మహిళ అయితే ఏకంగా..

Viral: ఇదేం పనమ్మా తల్లీ.. అందం కోసం ఇల్లు అమ్ముకోవడమేంటి..? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు డబ్బుల్లేక..!

ఈ భూమి మీద మనిషే శాశ్వతంగా ఉండడు. అలాంటిది వయసుతో పాటు తరిగిపోయే అందం గురించి తాపత్రయ పడటం వ్యర్థం. ఈ విషయాలు తెలిసినా చాలామంది అందంగా కనిపించడానికి తహతహలాడతారు. అందుకోసం లెక్కకు మిక్కిలి ప్రయత్నాలు చేస్తారు. ఈ మహిళ వీళ్లందరిని మించిపోయింది. అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యింది. అందుకోసం ఏకంగా బంగారం లాంటి ఇంటిని అమ్మేసింది. విచిత్రగా అనిపించే ఈ మహిళకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అందంకోసం ఓ అమెరికన్ మహిళ(American women) చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా(America)లోని అరిజోనా(Arizona) ప్రాంతంలో కెల్లీ బ్లీస్ అనే మహిళ నివసిస్తోంది. ఈమె వయసు 50ఏళ్లు(50years women). ఈమెకు అందం మీద మమకారం ఎక్కువ. అయితే వయసు పెరగడంతో పాటు ఆమె అందం తరిగిపోసాగింది. దీంతో ఆమె బోటాక్స్, ఫిల్లర్స్ వంటి కాస్మోటిక్ ట్రీట్మెంట్లన్నీ ప్రయత్నించింది. గత 15ఏళ్ళ నుండి ఇలాంటి ట్రీట్మెంట్లు ఎన్నో ప్రయత్నించి విసిగిపోయిన ఈమె చివరికి ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించింది. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ఆర్థిక స్థోమత ఆమెకు లేదు. ఈ కారణంతో ఆమె అరిజోనాలో ఉన్న తన మూడు పడకగదుల ఇంటిని(3 BK house) అమ్మేసింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీ(plastic surgery) చేయించుకుంది.

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది.. ఏఏ వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తోందంటే..!



ఈ ప్లాస్టిక్ సర్జరీలో తన మెడ, పెదవులు, ముఖం మొదలయిన ప్రాంతాలలో ముడుతలు పడిన చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చేశారు. ఇక తొడల భాగాల్లో పేరుకున్న కొవ్వును కూడా తొలగించారు. దీంతో 50ఏళ్ళ కెల్లీ బీస్ కాస్తా 30ఏళ్ల యువతిలా మారిపోయింది(50years women become 30). ఫేస్ లిప్ట్ అనేది కాస్మెటిక్ సర్జికల్ విధానం. ఇందులో అదనపు చర్మాన్ని తొలగించడం, మడుతలను తగ్గించడం, బలహీనమైన ముఖ కణజాలాన్ని తిరిగి టైట్ గా మార్చడం మొదలైనవి ఉంటాయి. ఆ సర్జరీ మొత్తానికి కలిపి కెల్లీ బ్లీస్ కు 14వేల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయట. అయితే ఉన్న ఇల్లు అమ్ముకున్న ఈమెకు ఇప్పుడు ఉండటానికి స్థిరనివాసం అంటూ లేదు. సర్జరీకి ఖర్చైపోనూ మిగిలిన డబ్బుతో ఓ వ్యాన్(van) కొనుగోలు చేసింది. ప్రపంచమంతా ఆ వ్యాన్ లో తిరుగుతోంది. ఈమె ప్రస్తుతం బ్లాగర్ గా పనిచేస్తోంది. కాగా ఈమె చేసిన పని తెలిసి ఈమెను విమర్శించేవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి విమర్శలతో విసిగిపోయిన ఈమె 'నేను చేసిన పని వల్ల అవమానాలు ఎదుర్కొనే పరిస్థితిని తొందరలోనే అధిగమించగలుగుతాను' అని చెప్పుకొచ్చింది. ఇల్లు అమ్మి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నందుకు ఈమెకు కొంచెం కూడా బాధగా లేదట. పైపెచ్చు యవ్వనంగా కనబడుతున్నందుకు ఈమె ఆనందం వ్యక్తం చేస్తోంది.

Tax Notice: ఇదేం ట్విస్ట్ బాబోయ్.. 10 ఏళ్ల క్రితమే చనిపోయిన మహిళకు ట్యాక్స్ నోటీస్.. రూ.7.56 కోట్ల పన్ను కట్టండంటూ..!


Updated Date - 2023-08-02T13:43:02+05:30 IST