Viral: సైబర్ క్రైమ్ ముఠాకే చుక్కలు చూపించాడుగా.. పార్ట్‌టైమ్ జాబ్ కావాలా..? అని వాట్సప్‌లో ఆ కుర్రాడికి మెసేజ్ వస్తే..

ABN , First Publish Date - 2023-09-05T14:29:01+05:30 IST

డబ్బు ఆశ చూపిస్తే చాలు మనుషులు ముందు వెనుకలు ఆలోచించకుండా కొన్ని తప్పు పనులు చేసేస్తారు. ఈ బలహీనతే మోసగాళ్ల బలం.

Viral: సైబర్ క్రైమ్ ముఠాకే చుక్కలు చూపించాడుగా.. పార్ట్‌టైమ్ జాబ్ కావాలా..? అని వాట్సప్‌లో ఆ కుర్రాడికి మెసేజ్ వస్తే..

మనుషుల్ని కొట్టకుండా, తాము కష్టపడకుండా డబ్బు దోచుకోవడానికి ఇప్పట్లో ఉన్న మార్గం ఆన్లైన్ మోసాలు. వీటిని సైబర్ క్రైమ్ మోసాలు అని కూడా అంటున్నారు. చాలామంది వాట్సాప్ లోనూ, ఆఫ్ లైన్ మెసెజ్ లలోనూ లింక్ లు షేర్ చేయడం వాటి సహాయంతో ఫోన్ హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం వంటివి చేస్తారు. మరికొందరు ఉద్యోగం పేరుతో ఆశ పెట్టి మోసం చేస్తారు. సోషల్ మీడియాలో పలుచోట్ల ఇలాంటి ఉద్యోగ అవకాశాల గురించి చాలా ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. మరికొందరు స్కామర్లు నేరుగా వాట్సాప్ మెసేజ్ చేస్తుంటారు. ఓ కుర్రాడికి అలానే పార్డ్ టైమ్ కావాలా? అంటూ వాట్సాప్ లో మెసేజులు వచ్చాయి. ఆ తరువాత ఆ కుర్రాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

డబ్బు ఆశ చూపిస్తే చాలు మనుషులు ముందు వెనుకలు ఆలోచించకుండా కొన్ని తప్పు పనులు చేసేస్తారు. ఈ బలహీనతే మోసగాళ్ల బలం. సులువుగా డబ్బు సంపాదించవచ్చని నిమిషాలకు డబ్బు లెక్క గట్టి చెబుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తుంటారు. ఓ కుర్రాడికి ఇలాగే సైబర్ క్రైమ్ (cuber crime scamers)మోసగాళ్ల నుండి వాట్సప్ లో మెసేజ్(Whatsapp messages) లు వచ్చాయి. 'నమస్తే! నేను మీతో ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కొన్ని నిమిషాలు నాకోసం కేటాయించగలరా?' అని మొదటి మెసేజ్ వచ్చింది. దానికి గానూ ఆ కుర్రాడు 'నేను మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాను' అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తరువాత ఆ స్కామర్ ' హాయ్ నా పేరు వియన్, నేను గ్లోబల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి మెసేజ్ చేస్తున్నాను. మీకు పార్డ్ టైమ్, లేదా ఫుల్ టైమ్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? మేము ఇచ్చే అవకాశంతో మీరు 5నుండి 30నిమిషాలలో రూ. 500 నుండి 5వేల వరకు సంపాదించవచ్చు' అని మరొక మెసేజ్ చేశాడు. దానికి ఆ కుర్రాడు స్నేహితుడు అంటే నిజాయితీకి మారుపేరు, ఈ భూగ్రం మీద ఏ ఒక్క వ్యక్తి ఇతరుల్లా ఉండరు' అని మళ్లీ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఆ స్కామర్ స్నేహితులను సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడం అంతకంటే మంచిది అని చెప్పాడు. ఈ చాటింగ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shocking: మీ ఇంట్లోంచి ఏదో పాడు వాసన వస్తోందంటూ పక్కింటి వాళ్ల నుంచి ఫోన్.. హడావిడిగా వచ్చి తలుపులు తీసి చూస్తే..!



ఈ స్కీన్ షాట్ ను Mahesh అనే అకొంట్ నుండి ట్విట్టర్ ఎక్స్(Twitter X) లో షేర్ చేశారు. 'ఒక వాట్సాప్ స్కామర్ ఈరోజు నాకు ఒక గుణపాఠం నేర్పాడు' అని అతను క్యాప్షన్ మెన్షన్ చేశాడు. ఈ స్క్రీన్ షాట్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'వామ్మో ఏకంగా స్కామర్ నే ముప్పు తిప్పలు పెట్టాడుగా' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను గ్రేట్.. ఇలాంటి స్కామర్లకు రిప్లయ్ ఇవ్వడానికి కూడా భయపడతారు చాలామంది' అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు తమకు వచ్చిన ఇలాంటి సైబర్ క్రైమ్ మెసేజ్ ల గురించి చెప్పుకొచ్చారు.

Viral Video: ఈ పిల్లాడు త్వరలోనే ఓవర్ నైట్ సెలబ్రెటీ అయిపోవడం ఖాయం.. నాలుకతోనే ఈ బండి సౌండ్‌ను దించేశాడుగా..!


Updated Date - 2023-09-05T14:29:01+05:30 IST