recognizing colours: నలుపు, తెలుపు, ఎరుపు... శిశువులు తొలుత గుర్తించే రంగు ఏదో తెలుసా? వారు ముందుగా ఈ ప్రపంచాన్ని ఏ రంగులతో చూస్తారంటే...

ABN , First Publish Date - 2023-03-30T10:24:05+05:30 IST

recognizing colours: శిశువులలో అభివృద్ధి ప్రక్రియ(development process) అనేది దశలవారీగా జరుగుతుంది. సాధారణంగా 5 నెలల వయసులో చిన్నారులు రంగులను(Colors) గుర్తించడం ప్రారంభిస్తారు.

recognizing colours: నలుపు, తెలుపు, ఎరుపు... శిశువులు తొలుత గుర్తించే రంగు ఏదో తెలుసా? వారు ముందుగా ఈ ప్రపంచాన్ని ఏ రంగులతో చూస్తారంటే...

recognizing colours: శిశువులలో అభివృద్ధి ప్రక్రియ(development process) అనేది దశలవారీగా జరుగుతుంది. సాధారణంగా 5 నెలల వయసులో చిన్నారులు రంగులను(Colors) గుర్తించడం ప్రారంభిస్తారు. పుట్టిన వెంటనే పిల్లలు అన్ని రకాల రంగులను గుర్తించలేరు. ఆ సమయంలో వారు ప్రపంచాన్ని తెలుపు, నలుపు(White, black) రంగులలో మాత్రమే చూస్తారని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

4 నెలల వయసులో నెమ్మదిగా వారి మనసులో రంగుల గురించి ఎరుక ఏర్పడుతుంది. నవజాత శిశువు(newborn baby) మొదట నలుపు, తెలుపుతో పాటు బూడిద రంగు షేడ్స్ మాత్రమే చూస్తారు. పిల్లలు తొలుత ఎరుపు రంగు(red color)ను గుర్తిస్తారు. దీని తరువాత వారు నెమ్మదిగా రంగుల మధ్య తేడాను గుర్తించడం మొదలుపెడతారు. 4 నెలల వయసులో పిల్లలు ఆకుపచ్చ, ఎరుపు మధ్య తేడాను గుర్తించగలుగుతారు. 5 నెలల తర్వాత పిల్లలు వివిధ రంగుల షేడ్స్‌(Shades of colors)ను గుర్తించడం ప్రారంభిస్తారు. క్రమంగా వయస్సుతో, వారు అన్ని రకాల రంగులను గుర్తించగలుగుతారు.

Updated Date - 2023-03-30T10:49:01+05:30 IST