Letter In Jail: ఖైదీ ఇతరులకు లేఖ రాయాలంటే ఏ నిబంధనలు పాటించాలి? అంతర్గత వ్యవహారాలు రాస్తే... పరిణామం ఎలా ఉంటుందంటే...

ABN , First Publish Date - 2023-03-11T06:50:22+05:30 IST

Letter In Jail: జైలులోని ఖైదీలు(Prisoners) కూడా లేఖలు రాయవచ్చు. ఖైదీలు తమకు వచ్చిన లేఖలను, వారు వారి కుటుంబ సభ్యులకు రాసిన లేఖలను(letters) గురించి అప్పుడప్పుడూ వింటూవుంటాం.

Letter In Jail: ఖైదీ ఇతరులకు లేఖ రాయాలంటే ఏ నిబంధనలు పాటించాలి? అంతర్గత వ్యవహారాలు రాస్తే... పరిణామం ఎలా ఉంటుందంటే...

Letter In Jail: జైలులోని ఖైదీలు(Prisoners) కూడా లేఖలు రాయవచ్చు. ఖైదీలు తమకు వచ్చిన లేఖలను, వారు వారి కుటుంబ సభ్యులకు రాసిన లేఖలను(letters) గురించి అప్పుడప్పుడూ వింటూవుంటాం. జైలులో ఉన్నప్పుడు వారు కుటుంబ సభ్యులను, స్నేహితులను ఎలా సంప్రదించాలనే దానిపై కొన్ని ప్రత్యేక నియమాలు(Special rules) ఉన్నాయి, వారు ఆ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. జైలులోని ఖైదీలు లేఖ రాసేందుకు జైలు అధికారులకు లిఖిత పూర్వకంగా వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

లేఖ రాసేటప్పుడు.. ఏ విషయంపై రాసినా అది జైలు నిబంధనలకు లేదా జైలు భద్రత(Prison security)కు వ్యతిరేకంగా ఉండకూడదు. ఖైదీలకు లేఖలు రాసే హక్కు ఉంది. అయితే వారు ఏఏ విషయాలు రాయవచ్చో ఏవి రాయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జైలులో జరిగే ప్రమాదాలు, నాసిరకం ఆహారం(food), అనవసర హంగామా తదితర జైలు అంతర్గత సమస్యలను ప్రస్తావించకూడదు. ఈ సమస్యల గురించి జైలు పరిపాలన లేదా ఉన్నతాధికారులకు తెలియజేయాలి, వారి కుటుంబ సభ్యులకు దీనిపై లేఖలు రాయకూడదు. జైలులోని ఇతర వ్యక్తుల గురించి చెడు(bad)గా రాయకూడదు.

ఫలితంగా జైలులోని ఇతర ఖైదీలలో విబేధాలు ఏర్పడవచ్చు. ఇది ఆ ఖైదీకి ఇబ్బందికరం(Embarrassing)గా మారే అవకాశం ఉంది. లేఖలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించకూడదు. ఇలాంటి పదజాలం ఉపయోగిస్తే సదరు ఖైదీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఖైదీ తాను చేసిన నేరం(crime) గురించి అబద్ధాలు రాయకూడదు. ఖైదీ తన అపరాధానికి తానే పూర్తి బాధ్యత వహించాలి. ఈ లేఖలో ఖైదీ తన శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయవచ్చు.

తన కుటుంబ సభ్యులు(Family members), స్నేహితులకు దూరంగా ఉండటం వలన, ఆ లేఖలో వారి గురించి ప్రస్తావించవచ్చు. ఖైదీ తన పరిస్థితి గురించి వారికి తెలియజేయవచ్చు. వారి సహాయాన్ని కోరవచ్చు. జైలు(prison)కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని లేఖలో లీక్ చేస్తే, సదరు ఖైదీపై జైలు పరిపాలన అధికారులు చర్యలు(Actions) చేపడతారు. అతను రాసిన లేఖను పంపకుండా నిలిపివేస్తారు.

Updated Date - 2023-03-11T07:53:31+05:30 IST