బైక్‌లోని సీసీ అంటే ఏమిటి? ఎంత సీసీ కలిగిన వాహనం కొనుగోలు చేయడం ఉత్తమమో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-19T13:31:10+05:30 IST

బైక్‌కు సంబంధించిన ప్రస్తావన రాగానే దానికి సంబంధించిన సీసీ(cc) గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇంతకీ సీసీ అంటే ఏమిటి? అది అందించే ప్రయోజనం(purpose) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బైక్‌లోని సీసీ అంటే ఏమిటి? ఎంత సీసీ కలిగిన వాహనం కొనుగోలు చేయడం ఉత్తమమో తెలిస్తే...

బైక్‌కు సంబంధించిన ప్రస్తావన రాగానే దానికి సంబంధించిన సీసీ(cc) గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇంతకీ సీసీ అంటే ఏమిటి? అది అందించే ప్రయోజనం(purpose) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సీసీ అంటే క్యూబిక్ కెపాసిటీ(cubic capacity). ఇది వాహనాల ఇంజన్ కెపాసిటీకి ఉపయోగించే పదం. ఇది ఆ వాహనానికి సంబంధించిన ఇంజిన్ గరిష్ట పవర్(Maximum power) అవుట్‌పుట్‌ను తెలియజేస్తుంది.

ఇంజిన్ చాంబర్ క్యూబిక్ సెంటీమీటర్ కొలతను సీసీ అంటారు. ఇంజిన్‌లో అధికంగా సీసీ ఉంటే ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. క్యూబిక్ కెపాసిటీ (సీసీ) వాహనపు పనితీరును(performance) ప్రభావితం చేస్తుంది. ఇదేవిధంగా ఇంజిన్ ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది? ఎంత శక్తి, టార్క్ ఉత్పత్తి చేస్తుంది అనేది కూడా ఇంజిన్ సీసీ మీద ఆధారపడి ఉంటుంది. చాలా బైక్‌లు 90సీసీ నుంచి 110సీసీ ఇంజన్‌ను(engine) కలిగివుంటాయి.

ఇటువంటి బైక్‌లు రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. అయితే స్పోర్ట్స్ బైక్‌కి మరింత శక్తివంతమైన ఇంజన్ అవసరం (350cc నుండి 650cc మధ్య). ఏదైనా బైక్‌ను(bike) ఎంచుకునే ముందు మీరు మీ అవసరాలను గుర్తించాలి. మీరు ఫ్లాట్ ప్లెయిన్ ఏరియాలో నివసిస్తుంటే తక్కువ సీసీ కలిగిన బైక్ సరిపోతుంది. మీరు కొండ ప్రాంతాలలో(hilly areas) నివసిస్తున్నట్లయితే మీకు శక్తివంతమైన ఇంజన్, ఎక్కువ పవర్ కలిగిన బైక్ అవసరమవుతుంది.

Updated Date - 2023-04-19T13:58:23+05:30 IST