చనిపోయిన వారి ఆధార్, పాన్ ఏమి చేయాలి?.. ఆ ఒక్క పని చేయకపోతే ముప్పు తప్పదా?

ABN , First Publish Date - 2023-03-14T08:41:26+05:30 IST

భారతదేశం(India)లో నివసిస్తున్నవారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకుండా ఏ ప్రభుత్వ సంబంధిత పనిని కూడా పూర్తిచేయలేరు. ఈ రెండు పత్రాలు భారత ప్రభుత్వం(Government of India) నుంచి జారీ అవుతాయి.

చనిపోయిన వారి ఆధార్, పాన్ ఏమి చేయాలి?..  ఆ ఒక్క పని చేయకపోతే ముప్పు తప్పదా?

భారతదేశం(India)లో నివసిస్తున్నవారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకుండా ఏ ప్రభుత్వ సంబంధిత పనిని కూడా పూర్తిచేయలేరు. ఈ రెండు పత్రాలు భారత ప్రభుత్వం(Government of India) నుంచి జారీ అవుతాయి. ఇవి ఇక్కడి పౌరుని గుర్తింపునకు ఎంతో కీలకమైనవి. బ్యాంక్ ఖాతా(Bank account)ను తెరవాలన్నా, పాస్‌పోర్ట్ పొందాలన్నా లేదా భూమిని కొనుగోలు చేయాలన్నా ఈ రెండు పత్రాలను తప్పనిసరిగా జతచేయాలి. భారతదేశంలో ఈ రెండు పత్రాలు లేని పౌరులు(Citizens) బహుశా ఎవరూ ఉండరు. అయితే చనిపోయిన వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా దేశాల్లో(many countries) ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతని ప్రభుత్వ, అధికారిక పత్రాలను నిష్క్రియం చేయాలనేది ఒక నియమం, తద్వారా ఎవరూ ఈ పత్రాలను ఉపయోగించలేరు. అయితే భారతదేశంలో అలా కాదు. ఇక్కడ ఆధార్ కార్డు(Aadhaar card)ను డీయాక్టివేట్ చేసే అవకాశం లేదు. అయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఆధార్ కార్డ్ సెంటర్‌కు వెళ్లి మరణించిన వ్యక్తికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాన్ని(Death certificate) ఆధార్ కార్డుతో అనుసంధానించడం అవసరం.

ఇలా చేసిన తర్వాత ఆ ఆధార్ కార్డును ఎవరూ దుర్వినియోగం(Misuse) చేయలేరు. ఒక వ్యక్తి చనిపోతే అతని పాన్ కార్డు సరెండర్ చేయాల్సివుంటుంది. ఈ ప్రక్రియ(process)కు కొంచెం సమయం పడుతుంది. ఇలా చేయడం ద్వారా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డ్‌(PAN card)ని ఎవరూ అక్రమంగా ఉపయోగించలేరు.

మరణించిన వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డును సరెండర్ చేయాలంటే, మృతుని సంబంధీకులు సంబంధిత అధికారికి దరఖాస్తు(Application) చేయాలి. ఈ అప్లికేషన్‌లో 'పాన్ కార్డ్' సరెండర్(Surrender) చేయడానికి గల కారణాన్ని పేర్కొనవలసి ఉంటుంది.

Updated Date - 2023-03-14T08:45:49+05:30 IST