Elections: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బును అసలేం చేస్తారు..? ఆధారాలు చూపించకపోతే ఈసీ ఏం చేస్తుందంటే..!
ABN , First Publish Date - 2023-10-16T21:06:07+05:30 IST
ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు అంటూ ధన ప్రవాహంలా మారిపోయింది. డబ్బుల కట్టలు, మద్యం సీసాలు లేకుండా పంచాయితీ స్థాయి ఎన్నికలు కూడా జరగడం లేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికలంటే డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెడుతుంటారు.
ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections) అంటూ ధన ప్రవాహంలా మారిపోయింది. డబ్బుల కట్టలు (Money in Elections), మద్యం సీసాలు లేకుండా పంచాయితీ స్థాయి ఎన్నికలు కూడా జరగడం లేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికలంటే డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెడుతుంటారు. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చాక ఇలా తరలించే డబ్బును (Money seize) పోలీసులు పట్టుకుంటారు. ఎన్నికల కోడ్ వల్ల నగదు రవాణాపై ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి నగదు అక్రమ రవాణాను అడ్డుకుంటారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కేవలం నగదునే కాదు.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, విలువైన వస్తువులు ఇలా ఏవైనా సరే అనుమానం వస్తే స్వాధీనం చేసుకుంటారు. పట్టుబడిన సొమ్ము రూ. 10 లక్షల లోపు ఉంటే పోలీసులు సంబంధిత వ్యక్తులను విచారిస్తారు. రూ.10 లక్షలు దాటితే ఐటీ శాఖ రంగంలోకి దిగుతుంది. సరైన డాక్యుమెంట్లు, లెక్కల చూపిస్తే ఆ డబ్బును (Seized Money) విడిపించుకుని తీసుకెళ్లొచ్చు. లేకపోతే మాత్రం ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. కోర్టుకు అప్పగిస్తారు. అక్కడి నుంచి ఆ నగదు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళుతుంది.
Fight in Train: అప్పర్ బెర్త్ కోసం ఇద్దరు కుర్రాళ్ల మధ్య బిగ్ ఫైట్.. అదిరిపోయే కామెంటరీతో పండుగ చేసుకున్న ప్రయాణీకులు..!
ప్రస్తుతం తెలంగాణతో (Telangana Elections) పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బుతో మీరు ప్రయాణిస్తుంటే అధికారులకు వివరణ ఇవ్వాల్సిందే. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందీ? కచ్చితంగా చెప్పాల్సిందే. మీరు చెప్పిన విషయాన్ని అధికారులు నమ్మకపోతే ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించాకే మీ నగదు మీకు తిరిగి అప్పగిస్తారు. అంతవరకు కోర్టు కస్టడీలో మీ సొమ్ము జమ చేస్తారు. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.