ఈ- టిక్కెట్, ఐ- టిక్కెట్ అంటే ఏమిటి... ఈ విధమైన రైలు టిక్కెట్ల ప్రయోజనాల్లో తేడాలివే...

ABN , First Publish Date - 2023-04-30T13:24:57+05:30 IST

రైలు ప్రయాణాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే రైలులో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్(Reservation) చేయించుకోవడం ఉత్తమమని చాలామంది భావిస్తుంటారు.

ఈ- టిక్కెట్, ఐ- టిక్కెట్ అంటే ఏమిటి... ఈ విధమైన రైలు టిక్కెట్ల ప్రయోజనాల్లో తేడాలివే...

రైలు ప్రయాణాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే రైలులో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్(Reservation) చేయించుకోవడం ఉత్తమమని చాలామంది భావిస్తుంటారు. రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇవి ఈ-టికెట్(E-Ticket) లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. ఈ-టికెట్ అనేది ప్రింటెడ్ టికెట్. అయితే ఐ-టికెట్(I-Ticket) అనేది భారతీయ రైల్వేల తరపున ప్రయాణీకులకు కొరియర్ అవుతుంది.

ఇంతకీ ఈ-టికెట్ అంటే ఏమిటి?

ఈ-టికెట్ అంటే ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ టికెట్. ప్రయాణికులు ఈ టిక్కెట్టును వారి సౌలభ్యం(Convenience) ప్రకారం ముద్రించవచ్చు. ఈ-టికెట్లు రైల్వే కౌంటర్‌లో కాకుండా ఇంటి నుండి లేదా ఏదైనా కంప్యూటర్ కేఫ్ నుండి ఆన్‌లైన్‌లో బుక్ అవుతాయి. దీని చెల్లుబాటు రైల్వే బుకింగ్ కౌంటర్ నుండి జారీ అయిన టిక్కెట్టుకు సమానంగా ఉంటుంది. ఈ-టికెట్ ద్వారా ప్రయాణించే ప్రయాణికులు తమ వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డు(Government Identity Card) (ఆధార్ కార్డు) తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఐ-టికెట్ అంటే ఏమిటి?

ఐ-టిక్కెట్ భారతీయ రైల్వేల తరపున ప్రయాణికుల చిరునామాకు కొరియర్ అవుతుంది. అయితే ఈ టికెట్ మీరు IRCTC వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్(Registration) సమయంలో మీరు ఇచ్చిన చిరునామాకు రైల్వేశాఖ కొరియర్ ద్వారా పంపుతుంది. ఇటువంటి టికెట్ ప్రయాణీకునికి చేరుకునేందుకు కనీసం 48 గంటలు పడుతుంది.

రెండింటి మధ్య వ్యత్యాసం

ఈ-టికెట్లు.. ఐ-టికెట్ల కంటే కొంచెం చౌకగా ఉంటాయి. కొరియర్ ఖర్చు(Courier cost)ను కవర్ చేయడానికి ఐ-టిక్కెట్‌లో డెలివరీ ఛార్జీ కూడా చేరి ఉంటుంది. ఎవరైనా అదే రోజున ఈ-టికెట్ల బుక్ చేసుకోవచ్చు, ఐ-టికెట్లను రెండు రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ-టికెట్ల రద్దు సులభం. ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే రద్దు చేయవచ్చు. అయితే ఐ- టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేయలేం. ఐ- టిక్కెట్‌ను రైల్వే స్టేషన్‌(Railway station)లోని కౌంటర్‌కి వెళ్లి, ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. అయితే ఈ-టికెట్లలో సీటు, బెర్త్ నిర్ధారణ(Confirmation of berth) అవుతుంది. లేదా RAC జాబితాలో చేరుతుంది.

Updated Date - 2023-04-30T13:25:28+05:30 IST