ఆ బాంబు గ్రనేడ్‌కి ఏ మాత్రం తీసిపోదు... జపాన్ ప్రధానిపై ప్రయోగించిన ఆయుధం అదే.. ‘పైప్ బాంబ్’ పవర్ ఏమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-16T07:34:53+05:30 IST

జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై స్మోక్ లేదా పైప్ బాంబు(pipe bomb)తో దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన వెంటనే సైనికులు(Soldiers) అతనిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కిషిదా ప్రసంగిస్తున్నప్పుడు ఎవరో పైపు బాంబుతో అతనిపై దాడి చేశారు.

ఆ బాంబు గ్రనేడ్‌కి ఏ మాత్రం తీసిపోదు... జపాన్ ప్రధానిపై ప్రయోగించిన ఆయుధం అదే.. ‘పైప్ బాంబ్’ పవర్ ఏమిటో తెలిస్తే...

జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై స్మోక్ లేదా పైప్ బాంబు(pipe bomb)తో దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన వెంటనే సైనికులు(Soldiers) అతనిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కిషిదా ప్రసంగిస్తున్నప్పుడు ఎవరో పైపు బాంబుతో అతనిపై దాడి చేశారు.

కాగా పైపు బాంబు అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పేలుడు పదార్థాన్ని(Explosive material) సుమారు ఒక అడుగు పొడవుగల పైపులో నింపుతారు. పైపు రెండు చివర్లలో సీలు చేస్తారు. ఉగ్రవాదులు(Terrorists) దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇది సులభంగా, తక్కువ ఖర్చుతో తయారు చేయగలుగుతారు.

ఎక్కువ నష్టం జరగాలనే ఉద్దేశ్యంతో కొన్నిసార్లు ఈ పైపు బాంబు చుట్టూ ఇనుము(iron) లేదా మరేదైనా లోహపు ముక్కలను జత చేరుస్తారు. తద్వారా పేలుడు సమయంలో భారీగా నష్టం(Heavy damage) జరుగుతుంది. ఇవి బుల్లెట్‌ మాదిరిగా పనిచేసి, చుట్టుపక్కల ప్రాంతాలలో మరింత నష్టం కలిగిస్తాయి. పలు నివేదికల ప్రకారం ఈ బాంబులను దక్షిణాసియా(South Asia)లో పనిచేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు విరివిగా ఉపయోగిస్తుంటాయి.

భారత సైన్యం(Indian Army)పై ఉగ్రవాదులు పైప్ బాంబులతో పలుమార్లు దాడి చేశారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపిన వివరాల ప్రకారం పైప్ బాంబు కనిష్ట దూరం(Minimum distance) 21 m (69 ft). గరిష్టంగా 366 m (1,201 ft). ఇంత దూరంలో ఉన్న దేనినైనా పైపుబాంబు నాశనం చేయగలదు. ఇది గ్రనేడ్‌(Grenade)కి ఏ మాత్రం తీసిపోదు. పైప్ బాంబు ఎంత ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందనేది దానిలో నింపిన పేలుడు పదార్థం(Explosive material)పై ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2023-04-16T07:40:50+05:30 IST