మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా? అయితే క్రికెట్ ఫుల్ ఫామ్ ఏమిటో చెప్పండి... తెలియదంటారా? అయితే సమాధానం ఇదే..
ABN , First Publish Date - 2023-05-02T07:39:12+05:30 IST
జనరల్ నాలెడ్జ్(General Knowledge) అనేది ఎవరికైనా ముఖ్యమే. ఇది లేకపోతే అవమానపడే సందర్భాలు కూడా ఎదురుకావచ్చు.
![మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా? అయితే క్రికెట్ ఫుల్ ఫామ్ ఏమిటో చెప్పండి... తెలియదంటారా? అయితే సమాధానం ఇదే..](https://media.andhrajyothy.com/media/2023/20230426/Untitled_1_2a462c3d1f.jpg)
జనరల్ నాలెడ్జ్(General Knowledge) అనేది ఎవరికైనా ముఖ్యమే. ఇది లేకపోతే అవమానపడే సందర్భాలు కూడా ఎదురుకావచ్చు. అయితే ఎవరైనా మిమ్మల్ని క్రికెట్(Cricket) ఫుల్ ఫామ్ ఏమిటని ఎప్పుడైనా అడిగారా? లేదా అయితే ఇప్పుడే దాని సమాధానం(Answer) తెలుసుకుందాం. అలాగే క్రికెట్ ను హిందీలో ఏమంటారో కూడా తెలుసుకుందాం.
క్రికెట్ ఫుల్ ఫామ్ ఇదే..
క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్(gentleman's game) అని అంటారు. ఇది ఇంగ్లండ్ జాతీయ క్రీడ. దీన్ని జెంటిల్‌మన్ గేమ్ అని ఎందుకు అంటారనేది దాని ఫుల్ ఫామ్‌లో పూర్తిగా వ్యక్తం అవుతుంది. CRICKET అనే పదంలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక అర్ధం ఉంది. ఈ అర్థమే ఈ ఆటను జంటిల్‌మన్ క్రీడగా మార్చింది. Abbreviations.com తెలిపిన వివరాల ప్రకారం, CRICKET ఫుల్ ఫామ్ ఇదే...
C- కస్టమర్ ఫోకస్ (వినియోగదారునిపై దృష్టి)
R - రెస్పెక్ట్ ఫర్ ఇండివిడ్యువల్ (ప్రతీ వ్యక్తికీ గౌరవం)
I- ఇంటిగ్రిటీ (సమగ్రత)
C- కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ (సామాజిక సహకారం)
K- నాలెడ్జ్ వర్షిప్ (జ్ఞాన ఆరాధన)
E-ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణ)
T- టీమ్‌వర్క్
ఇక్కడ తెలియజేసిన క్రికెట్‌లోని ప్రతీ అక్షరానికి(each character) గల అర్థం... హుందాతనం కలిగిన వ్యక్తిలో కనిపిస్తాయి. అందుకే దీనిని జెంటిల్‌మన్ గేమ్ అంటారు. ఇకపై మిమ్మల్ని ఎవరైనా క్రికెట్ ఫుల్ ఫామ్ ఏమిటని అడిగితే హుందాగా దీనిని చెప్పండి.
క్రికెట్‌ని హిందీలో ఏమంటారంటే...
ఇంగ్లీషులో క్రికెట్ అనేది చాలా సింపుల్ వర్డ్‌గా కనిపిస్తుంది. అయితే హిందీలో క్రికెట్ పేరు చాలా క్లిష్టంగా ఉంటుంది. క్రికెట్‌ను హిందీలో 'గోల్గట్టం లకడ్ పట్టం దే దనాదన్ ప్రతియోగితా' ('Golgattam Lakad Pattam De Danadan Pratyogita')అని అంటారు.
క్రికెట్‌లోని బ్యాట్స్‌మన్, బౌలర్, అంపైర్లకు హిందీలో ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. బ్యాట్స్‌మన్‌ను బల్లేబాజ్ అని, బౌలర్‌ను గేంద్‌బాజ్ అని అంటారు. అంపైర్(Umpire)ను హిందీలో నిర్ణాయక్ అని అంటారు.