డెబిట్, క్రెడిట్ కార్డులపై కనిపించే క్లాసిక్, గోల్డ్, ప్లాటినం, టైటానియం పదాలకు అర్థం ఏమిటో తెలుసా? వీటి ప్రయోజనాలు ఎంత భిన్నంగా ఉంటాయంటే...

ABN , First Publish Date - 2023-04-22T11:14:06+05:30 IST

ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డుల(Debit and credit cards) వినియోగం కూడా మరింతగా పెరింది.

డెబిట్, క్రెడిట్ కార్డులపై కనిపించే క్లాసిక్, గోల్డ్, ప్లాటినం, టైటానియం పదాలకు అర్థం ఏమిటో తెలుసా? వీటి ప్రయోజనాలు ఎంత భిన్నంగా ఉంటాయంటే...

ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డుల(Debit and credit cards) వినియోగం కూడా మరింతగా పెరింది. అయితే డెబిట్, క్రెడిట్ కార్డులపై క్లాసిక్, గోల్డ్, ప్లాటినం, టైటానియం(Titanium) అనే పేర్లు కనిపిస్తాయి. కార్డు తీసుకునే సమయంలో ఇచ్చే ఆప్షనల్లో ఇవి కనిపిస్తాయి. వాటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోల్డ్ కార్డ్

వీసా గోల్డ్ కార్డ్(Gold card) కలిగి ఉండటం వలన ట్రావెల్ అసిస్టెన్స్, గ్లోబల్ కస్టమర్ అసిస్టెన్స్ సర్వీసెస్ ప్రయోజనం లభిస్తుంది. ఈ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఆమోదంపొందినది. గోల్డ్ కార్డ్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయివుంటుంది. ఇంతేకాకుండా మీరు రిటైల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్(Entertainment) అవుట్‌లెట్‌లలో ఈ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, మీరు వివిధ రకాలైన తగ్గింపులను అందుకుంటారు.

ప్లాటినం కార్డు

ప్లాటినం కార్డ్‌లో కస్టమర్ నగదు పంపిణీ నుండి గ్లోబల్ ATM నెట్‌వర్క్ వరకు సౌకర్యాలను పొందవచ్చు. ఇదేకాకుండా వైద్యం, చట్టపరమైన రిఫరల్(Referral), సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఈ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా వందలాది డీల్స్, డిస్కౌంట్ ఆఫర్‌లు, ఇతర సౌకర్యాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

టైటానియం కార్డు

ప్లాటినం కార్డ్‌(Platinum Card)తో పోలిస్తే మీరు టైటానియం కార్డ్‌లో ఎక్కువ క్రెడిట్ పరిమితిని పొందుతారు. ఈ కార్డ్ సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్, భారీ ఆదాయం కలిగిన వ్యక్తులకు ఇస్తారు.

సిగ్నేచర్ కార్డ్‌

విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా అనేక ఇతర సేవలు సిగ్నేచర్ కార్డ్‌(Signature Card)లో అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2023-04-22T11:14:30+05:30 IST