Smart Phone: స్మార్ట్‌ఫోన్‌కు కింది భాగంలో ఆ రంధ్రం దేనికోసం..? ఛార్జింగ్ కోసం కాదు.. ఇయర్ ఫోన్స్ కోసం కూడా కాదు కానీ..!
ABN , First Publish Date - 2023-06-13T14:36:41+05:30 IST
కానీ ఇంత సమయం మనతో ఉంటున్న సెల్ ఫోన్ గురించి మనకు తెలిసింది తక్కువే.
సెల్ ఫోన్ వాడకం తెలియని మనుషులు దాదాపు తక్కువగానే ఉన్నారు మన చుట్టూ, ప్రతి ఒక్కరికీ ఇప్పుడు రోజులో అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉన్నదంటే అది సెల్ ఫోన్ మాత్రమే. అంతేనా ఆర్థిక లావాదేవీలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లతోనే చేస్తుండడం వలన ఫోన్స్ మరీ ముఖ్యం అయిపోతున్నాయి. ఉద్యోగాల రిత్యా రోజులో చాలా సమయం ఫోన్‌లతోనే గడిపేస్తున్నాం కూడా. కానీ ఇంత సమయం మనతో ఉంటున్న సెల్ ఫోన్ గురించి మనకు తెలిసింది తక్కువే. ఫోన్ చేసుకోవడానికి, వీడియోలు, యాప్‌లు, వంటివి తప్పితే ఆ పరికరాన్ని గురించి మరీ ముఖ్యంగా మనకేం తెలీదు. నిజానికి ఇది అందరూ పెద్దగా పెట్టించుకోని విషయం.
ఈ చిన్న రంధ్రం దేనికి ఇస్తారో మీకైనా తెలుసా..?
మొబైల్‌ని సరిగ్గా పరిశీలిస్తే మన ఫోన్ జాక్ ను ఉంచే చోట, డిజైన్ లో ఉండే భాగంలో చిన్న రంధ్రం కనిపిస్తుంది అది ఎందుకు ఉంచుతారో, దాని వల్ల ప్రయోజనం ఏమిటో ఎప్పుడన్నా కనుక్కున్నారా? ఇదేం డిజైన్‌లో పొరపాటు కాదు. ఈ రంధ్రం పొరపాటుగా ఫోన్‌లో రాలేదు. విరిగిపోవడం అసలు కాదు.
ఇది కూడా చదవండి: రైళ్లకు అసలు పేర్లు ఎలా నిర్ణయిస్తారు..? Shatabdi, Duronto Express రైళ్ల పేర్ల వెనుక ఇంత కథ ఉందా..?
సెల్ ఫోన్ కింద కనిపించే రంధ్రం ఏమిటి?
మనం మన సెల్‌ఫోన్‌ని గమనించి చూస్తే, దిగువన ఖాళీ ఉంటుంది. దాదాపుగా పైకి పెద్దగా కనిపించదు. ఇందులో మొదటిది సిగ్నల్ ద్వారా కాల్స్ నాణ్యతను మెరుగుపరచడానికి, మరీ పెద్దగా బాధించే శబ్దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండవది మైక్రోఫోన్‌ల పనితీరును నిర్వహిస్తుంది. అలాగే యాక్టివేట్ చేసే స్పీకర్ గా కూడా పనిచేస్తుంది. అన్నింటిలో మొదటిది, ఇది నానోసిమ్, మైక్రో SD స్లాట్ నుండి భిన్నంగా ఉంటుంది.
ఎందుకంటే కీ లేదా పిన్‌తో నొక్కినప్పుడు, ట్రే బయటకు రాదు. చాలా సెల్ ఫోన్‌లు మైక్రోఫోన్ నిల్వ చేసిన ఛార్జింగ్ పోర్ట్‌కు పక్కనే దిగువ ప్రాంతంలో రంధ్రం ఉంటుంది. స్పీకర్‌కు మైక్రోఫోన్‌గా ప్లే చేసే ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ విధంగా, కాల్స్ మరింత స్పష్టంగా ఉంటాయి.