తడిసిన పట్టాలు.. మొరాయించిన రైలు.. వెంటనే తేరుకున్న లోకో పైలెట్ ఆ స్విచ్ నొక్కాడు.. రైలు ముందుకు కదిలింది.. ఆ ‘స్విచ్ సీక్రెట్’ ఏమిటంటే..
ABN , First Publish Date - 2023-04-05T08:09:23+05:30 IST
వాతావరణం అనుకూలించనప్పుడు రైలు(train) నడపడంలో లోకో పైలెట్(Loco Pilot) ఇబ్బందులు పడతాడు. అయితే ఈ సమస్యలకు ఇంజిన్‌లోని శాండ్ బాక్స్(Sand box) పరిష్కారం చూపుతుంది.
వాతావరణం అనుకూలించనప్పుడు రైలు(train) నడపడంలో లోకో పైలెట్(Loco Pilot) ఇబ్బందులు పడతాడు. అయితే ఈ సమస్యలకు ఇంజిన్‌లోని శాండ్ బాక్స్(Sand box) పరిష్కారం చూపుతుంది. అందేంటది? శాండ్ బాక్స్ ఏమిటి? అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో, లేదా పొగమంచు(fog) ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ట్రాక్‌లు(Railway tracks) తడిసిపోతుంటాయి.
అటువంటప్పుడు రైలును ఆ ట్రాక్‌లపై నడపడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే రైలు ఇంజిన్(Train engine)లో అమర్చిన ఇసుక పెట్టె ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. తడి ట్రాక్‌ల కారణంగా రైలు వేగాన్ని అందుకోవడంలో సమస్య తలెత్తుతుంది. చక్రం ముందుకు కదలకుండా అదివున్న చోటునే తిరగడం ప్రారంభిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైళ్లను నడిపే లోకో పైలట్లు(Loco Pilots) ఇసుక బాక్సులను ఉపయోగించి ట్రాక్‌లపై ఇసుకను చల్లుతుంటారు.
దీని కారణంగా ట్రాక్‌లు, రైలు చక్రాల మధ్య ఘర్షణ(clash) పెరుగుతుంది. రైలు సరైన వేగంతో ఎలాంటి వాతావరణంలోనైనా ముందుకు దూసుకుపోతుంది. ఇసుక పెట్టెను ఉపయోగించడానికి, లోకో పైలట్(Loco Pilot) ముందుగా సాండర్ స్విచ్‌ను నొక్కుతాడు. వెంటనే ఇసుక పెట్టె నుంచి ట్రాక్‌లపై పొడి ఇసుక(sand) పడుతుంది. ఫలితంగా వీల్ స్లిప్ తగ్గి రైలు సులభంగా ముందుకు కదులుతుంది.