పేస్టు.. టూత్ బ్రష్ ఎక్కడ పెడుతుంటారు? బాత్రూమ్ లోనా? బయటా? తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేస్తున్నారో..
ABN , First Publish Date - 2023-05-15T12:26:40+05:30 IST
. బాత్రూమ్ లో టూత్ బ్రష్, పేస్ట్(tooth brush, paste) ఉంచడం చాలా సహజమైన విషయం. కానీ..
ఉదయం లేవగానే బ్రష్ చేయడంతోనే రోజు మొదలవుతుంది. టూత్ బ్రష్ ను, పేస్ట్ ను చాలామంది బాత్రూమ్ లో పెడుతుంటారు. మరికొందరు బాత్రూమ్ బయట పెడుతుంటారు. అయితే ఎక్కువ శాతం మంది టూత్ బ్రష్ ను పేస్ట్ ను బాత్రూమ్ లో పెట్టడం చూస్తూంటాం. కానీ ఇలా బాత్రూమ్ లో పేస్ట్, బ్రష్ పెట్టడం ప్రమాదం అంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే సమస్యలు ఏంటి? అసలు బాత్రూమ్ లో ఉంచకూడని వస్తువులు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
ఈ మధ్య కాలంలో ప్రతి వస్తువు గురించి పరిశోధనలు(research) జరుగుతున్నాయి. వీటిలో చాలా షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. బాత్రూమ్ లో టూత్ బ్రష్, పేస్ట్(tooth brush, paste) ఉంచడం చాలా సహజమైన విషయం. కానీ అలా ఉంచడం ప్రమాదమని చెబుతున్నారు పరిశోధకులు. ఉదయాన్నే టాయిలెట్ కు వెళ్లిన తరువాత అందులో నీటిని పోయడం సహజం. ఇలా చేసినప్పుడు ఏరోసోల్(Aerosol) అనే బిందువులు బటయకు పడతాయి. బాత్రూమ్ లో ఉండే టూత్ బ్రష్(tooth brush), పేస్ట్(paste), షాంపూ(shampoo), సోప్(soap) మొదలైన వాటిపై ఇవి వ్యాప్తం అవుతాయి. ఈ ఏరోసోల్స్ బ్యాక్టీరియా అభివృద్ది చెందడానికి తగిన వాతావరణం ఏర్పరుస్తాయి. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్(urine infections), నోరోవైరస్ ఇన్ఫెక్షన్(Norovirus infections), హెపటైటిస్ ఎ(hepatitis-a), ఇ-కోలి ఇన్ఫెక్షన్(e-coli infection) వంటివి ఈ కారణంగానే వస్తాయి. చాలామంది ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయేంటి అని తలబద్దలయ్యేలా ఆలోచిస్తుంటారు. కానీ అసలు కారణం ఇదే.
కంబైన్డ్ బాత్రూమ్(combined bathroom) లు ఉపయోగించేవారికి ఈ సమస్యలు విపరీతంగా ఉంటాయి. స్నానం చేసేటప్పుడు, టాయిలెట్ కు వెళ్ళినప్పుడు, పేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా చాలా సమయాల్లో బాత్రూమ్ లో తేమ ఏర్పడుతుంది.ఈ తేమ టూత్ బ్రష్ మీద ఎప్పటికప్పుడు ప్రభావం చూపిస్తుంది. రోజుమొత్తం బ్రష్ ను బాత్రూమ్ లో ఉంచడం వల్ల అందులో చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. టూత్ బ్రష్, పేస్ట్ మాత్రమే కాదు..స్నానం చేసిన తరువాత తడి టవల్, హెయిర్ ట్రిమ్మర్లు, బ్యూటీ ప్రోడక్ట్ వంటివి కూడా ఇలాంటివి అటాచ్డ్ బాత్రూమ్ లలో ఉంచడం మంచిది కాదు.