దేశంలో ఏ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారంటే...

ABN , First Publish Date - 2023-01-30T11:02:17+05:30 IST

ప్రతి దేశంలోని ప్రజలు నగదు చెల్లింపులకు దూరమవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి.

దేశంలో ఏ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారంటే...

ప్రతి దేశంలోని ప్రజలు నగదు చెల్లింపులకు దూరమవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్లాస్టిక్ మనీ అయిన డెబిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవలసి వస్తే అది మన జీవితంలో ముఖ్య భాగంగా మారింది. భారతదేశంలో డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారి విషయానికి వస్తే దేశంలో సుమారు 94.77 కోట్ల డెబిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయి.

వీటిలో 60 శాతం డెబిట్ కార్డులు కేవలం 6 బ్యాంకులవే కావడం విశేషం. గరిష్ట సంఖ్యలో డెబిట్ కార్డ్‌లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినవి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 7.9 కోట్ల డెబిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రెండవ స్థానంలో ఉంది. యూనియన్ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. మొత్తం డెబిట్ కార్డుల్లో ఈ బ్యాంకు వాటా 5.4 శాతం. అదే సమయంలో మొత్తం డెబిట్ కార్డులలో హెచ్‌డీ‌ఎఫ్‌సీ, కెనరా బ్యాంక్ వాటా 5.1 శాతంగా ఉంది.

Updated Date - 2023-01-30T11:02:19+05:30 IST