Share News

White Hair: చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్యా? కేవలం ఈ 4 ఆహారాలతో షాకింగ్ రిజల్ట్ పక్కా..

ABN , First Publish Date - 2023-11-26T12:29:01+05:30 IST

పూర్తీగా తెల్లజుట్టు మాయమైపోయి జుట్టు నల్లగా నిగనిగలాడాలన్నా, బాగా పెరగాలన్నా ఈ నాలుగు ఉంటే సరి!

White Hair: చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్యా? కేవలం ఈ 4 ఆహారాలతో షాకింగ్ రిజల్ట్ పక్కా..

తెల్లజుట్టు సమస్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది. జీవనశైలి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తినడానికి ఆసక్తి చూపడం. పండ్లు తినడానికి నిరాకరించడం మొదలైనవన్నీ చిన్నవయసులో తెల్లజుట్టుకు కారణం అవుతాయి. పెద్దయ్యే కొద్దీ ఈ సమస్య మరింత దారుణంగా తయారవుతుంది. చిన్నవయసులోనే హెయిర్ డైలు వేసి తెల్లజుట్టును కవర్ చెయ్యాల్సి వస్తుంది. కానీ ఆ అవసరం లేకుండా పూర్తీగా తెల్లజుట్టు మాయమైపోయి జుట్టు నల్లగా నిగనిగలాడాలన్నా, బాగా పెరగాలన్నా ఆహారంలో ఈ కింది పదార్థాలను తప్పకుండా తినిపించాలి.

నల్లనువ్వులు.. (Black sesame)

నల్లనువ్వులు మెలనిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. మెలనిన్ జుట్టుకు నలుపు రంగును ఇస్తుంది. నల్లనువ్వులు లేదా నువ్వుల చిక్కీ, నువ్వుల లడ్డు వంటివి రోజూ తింటూ ఉంటే తొందరలోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతంది. నల్లనువ్వులలో కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఎముక బలానికి, మహిళలలో నడుము బలంగా ఉండటానికి, రక్తహీనత సమస్యకు కూడా చక్కని పరిష్కారం.

ఉసిరికాయ..(Gooseberry)

ఉసిరికాయను ఆయుర్వేదంలో అమృత ఫలం అని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. నెరిసిన జుట్టు నల్లగా మార్చడంలో ఉసిరి సహాయపడుతుంది. ఇదెలాగో కార్తీక మాసం. ఇప్పుడు ఉసిరికాయలు రావడం మొదలవుతాయి. ఉసిరికాయను పచ్చిగా తినడం లేదా జ్యూస్, లేదా క్యాండీ చేసుకుని తినవచ్చు. సంవత్సరమంతా నిల్వ ఉంచుకోవడానికి ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసి నిల్వచేసుకుని రోజూ తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇలా జరుగుాతాయి..


నల్ల ఎండుద్రాక్ష..(Black raisins)

నల్ల ఎండుద్రాక్షలో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలను గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. చిన్నవయసులో జుట్టు నెరిసిపోవడాన్ని నివారిస్తుంది. రోజూ కొన్ని నానబెట్టిన లేదా నల్ల ఎండుద్రాక్ష లేదా తాజా నల్ల ద్రాక్ష తింటే జుట్టు నల్లగా మారుతుంది.

కరివేపాకు..(Curry leaves)

కరివేపాకు జుట్టు పెరుగుదలకు గొప్ప ఔషదం. కరివేపాకులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి12 పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటాయి. కరివేపాకు రైస్, కరివేపాకు కారప్పొడి, కరివేపాకు పచ్చడి, వివిధ రకాల స్నాక్స్ లో కరివేపాకు జోడించడం, కరివేపాకును నీటిలో ఉడికించి టీలా తాగడం వల్ల జుట్టు రాలడమనే సమస్యతోపాటు చిన్నవయసులోనే వచ్చే తెల్లజుట్టుకు చెక్ పెచ్చవచ్చు.

(నోట్: ఇందులో అంశాలు పలు అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న సమాచారం ఆధారంగా పొందుపరచబడింది. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్యలున్నా వైద్యులను సంప్రదంచడం మంచిది.)

ఇది కూడా చదవండి: నెల రోజుల పాటు చక్కెర వాడటం బంద్ చేస్తే.. జరిగేది ఇదే..!

Updated Date - 2023-11-26T12:29:07+05:30 IST