Aparna Iyer: ఎవరీ అపర్ణ..? 20 ఏళ్ల క్రితం విప్రో కంపెనీలోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారంటే..!
ABN , First Publish Date - 2023-09-24T11:31:04+05:30 IST
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ నూతన ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా అపర్ణా అయ్యర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎఫ్‌వోగా ఉన్న జతిన్ దలాల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలోకి అపర్ణ వచ్చారు. అపర్ణ 20 ఏళ్ల క్రితం విప్రో కంపెనీలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు.
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) సంస్థ నూతన ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణా అయ్యర్ (Aparna Iyer)బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎఫ్‌వోగా ఉన్న జతిన్ దలాల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలోకి అపర్ణ వచ్చారు. అపర్ణ 20 ఏళ్ల క్రితం విప్రో కంపెనీలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. అప్పట్నుంచి అదే సంస్థలో అపర్ణ పలు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా అతి కీలక పదవికి చేరుకున్నారు.
అపర్ణ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో 2002లో చేరి గోల్డ్ మెడల్ (Gold Medal)ను దక్కించుకున్నారు. ఆ తర్వాత 2003లో సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలో జాయిన్ అయిన అపర్ణ ఆ తర్వాత బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అనాలసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి పలు నాయకత్వ బాధ్యతలను సమర్థంగా పోషించారు.
Financial Rules: ముచువల్ ఫండ్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ వరకు.. అక్టోబర్ 1 నుంచి 6 కొత్త రూల్స్..!
సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించక ముందు అపర్ణ విప్రో ఫైనాన్స్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, అపర్ణ కంటే ముందు విప్రో సీఎఫ్‌వోగా పని చేసిన జతిన్ దలాల్ వేరే సంస్థలోకి మారబోతున్నారు. విప్రో బయట తన కెరీర్‌ను ఎంచుకోవాలని నిర్ణయించకున్నట్టు జతిన్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన విప్రో యాజమాన్యానికి జతిన్ ధన్యవాదాలు తెలియజేశారు.