ఖైదీలకు ఆ తరహా దుస్తులనే ఎందుకు కేటాయించారు? ఈ విధానం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-04-18T09:47:48+05:30 IST
ఖైదీలు తెలుపు రంగు(white color) దుస్తుల్లో మనకు కనిపిస్తుంటారు. మరో రంగు దుస్తుల్లో వారిని ఎప్పుడూ చూసివుండం. ఇలా తెలుపు రంగు దుస్తులనే ఖైదీలకు(prisoners) ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖైదీలు తెలుపు రంగు(white color) దుస్తుల్లో మనకు కనిపిస్తుంటారు. మరో రంగు దుస్తుల్లో వారిని ఎప్పుడూ చూసివుండం. ఇలా తెలుపు రంగు దుస్తులనే ఖైదీలకు(prisoners) ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంశం చరిత్ర(history)తో ముడిపడవుంది. 18వ శతాబ్దంలో అమెరికాలో ఆబర్న్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనిలో జైళ్లు, అక్కడ ఉండే ఖైదీల జీవితానికి సంబంధించిన నియమ నిబంధనలను(Rules) అనుసంధించారు.
అనంతరం ఆధునిక జైళ్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో ఖైదీలకు బూడిద-నలుపు రంగు దుస్తులు ఇచ్చారు. వాటిపై చారలు కూడా ఉండేవి. పలు కథనాల ప్రకారం ఖైదీలు తెలుపురంగు దుస్తులు ధరించి ఉంటే, ఒకవేళ వారు తప్పించుకుని పారిపోతే.. పోలీసులు(police) వారిని పట్టుకోవడం మరింత సులభం అవుతుంది. తెలుపు రంగు దుస్తులలో ఏ ఖైదీ అయినా పరారైతే, అతనిని ఎవరైనా చూస్తే వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగలుగుతారు.
క్రమశిక్షణకు(discipline) గుర్తుగా కూడా ఖైదీలకు ఈ తరహా దుస్తులు అందిస్తారు. బూడిద-నలుపు చారల దుస్తులు అవమానానికి చిహ్నంగా భావిస్తారు. ఫలితంగా నేరస్తులలో పశ్చాత్తాపం(regret) కలుగుతుందని చెబుతారు. అలాగే ఖైదీలకు తెలుపు రంగు దుస్తులు ఇవ్వడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ రంగు అంత వేడిగా ఉండదని, అందుకే వారికి ఈ రంగు దుస్తులు కేటాయించారని చెబుతారు. మరోవిధంగా చూస్తే తెలుపు రంగు దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఖైదీ ఎప్పుడైనా జైలు(prison) నుండి తప్పించుకుంటే, రాత్రి సమయంలో కూడా అతనిని దూరం నుండి గమనించవచ్చు.
19 వ శతాబ్దంలో ఖైదీల దుస్తుల రంగులు మార్చారు. అప్పుడు నలుపు-తెలుపు దుస్తులు అందించారు. ఇటువంటి దుస్తులను శిక్ష ఖరారైన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఖైదీలకు ఒకే రకమైన దుస్తుల కేటాయింపు అనేది లేదు. ఖైదీల విషయంలో ప్రతి దేశానికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది. భారతదేశం(India)లోని ఖైదీలకు ప్రత్యేక దుస్తులు కేటాయించే ధోరణి బ్రిటిష్(British) వారి కాలం నుండి కొనసాగుతోంది.