ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీపై 3 నక్షత్రాలను గమనించారా?... అవి ఎందుకున్నాయో తెలిస్తే.. అమాంతం రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ABN , First Publish Date - 2023-04-18T12:08:18+05:30 IST

బ్లూ జెర్సీతో మ్యాచ్ అఢే భారత క్రికెట్ జట్టు(Indian cricket team)ను మనం చాలాసార్లు చూసేవుంటాం. కొన్నిసార్లు జెర్సీల రంగులలో మార్పులు కనిపిస్తాయి.

ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీపై 3 నక్షత్రాలను గమనించారా?... అవి ఎందుకున్నాయో తెలిస్తే.. అమాంతం రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

బ్లూ జెర్సీతో మ్యాచ్ అఢే భారత క్రికెట్ జట్టు(Indian cricket team)ను మనం చాలాసార్లు చూసేవుంటాం. కొన్నిసార్లు జెర్సీల రంగులలో మార్పులు కనిపిస్తాయి. అయితే భారత పురుషుల క్రికెట్ జట్టు జెర్సీపై BCCI లోగో పైభాగంలో మూడు స్టార్లు(Three stars) ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వీటి వెనుకగల కారణం ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెటర్లు ధరించే జెర్సీలపై కనిపించే ఈ స్టార్‌లు డిజైన్‌(Design)లో భాగం కాదు. ఈ నక్షత్రాల గుర్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఈ స్టార్లు భారత పురుషుల క్రికెట్ జట్టు సాధించిన ఘన విజయాన్ని(Success) సూచిస్తాయి. ఈ స్టార్లు.. భారత క్రికెట్ జట్టు దక్కించుకున్న ప్రపంచ కప్‌ను గుర్తుచేస్తాయి. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల క్రికెట్ జట్టు మూడు సార్లు ప్రపంచకప్‌(World Cup)ను గెలుచుకుంది.

ఇందులో భారత జట్టు వన్డే ఫార్మాట్‌లో 2 సార్లు, టీ20 ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీనిని సూచిస్తూ జెర్సీలపై బీసీసీఐ లోగో(BCCI logo)పైన మూడు స్టార్లను తీర్చిదిద్దారు. ఇక ఆస్ట్రేలియా జెర్సీ విషయానికొస్తే వారి జెర్సీపై 6 నక్షత్రాలు(6 stars) ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 6 సార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ జట్టు వన్డే ఫార్మాట్‌(ODI format)లో 5 సార్లు, టీ20 ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచకప్‌(World Cup)ను గెలుచుకుంది.

Updated Date - 2023-04-18T12:14:27+05:30 IST