Viral: బస్సు సీట్లను చూస్తే ఇలా ఎప్పుడైనా అనిపించిందా? చాలా పెద్ద కుట్ర!

ABN , First Publish Date - 2023-10-10T20:25:44+05:30 IST

బస్సు సీట్ల డిజైన్ వెనుక భారీ కుట్ర ఉందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: బస్సు సీట్లను చూస్తే ఇలా ఎప్పుడైనా అనిపించిందా? చాలా పెద్ద కుట్ర!

ఇంటర్నెట్ డెస్క్: బస్సు సీటు కవర్లను ఎప్పుడైనా నిశితంగా గమనించారా? డార్క్ రంగులతో, కన్‌ఫ్యూజ్ చేసే రకరకాల డిజైన్లు ఉన్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే, మీరు కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే. బస్సు సీటు కవర్ వెనుక పెద్ద కుట్ర కోణం ఉదంటూ ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా(Viral Video) మారింది. తన వాదనను సమర్థించుకునేందుకు అతడు చూపించిన ఆధారం కూడా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కొందరు నిజమేనని అంగీకరించారు కూడా!

Viral: వామ్మో.. ఇజ్రాయెల్ ఇలాంటి బాంబులు వాడుతోందా..? నెట్టింట కలకలం!


సదరు నెటిజన్ చెప్పిన వివరాల ప్రకారం, బస్సు సీటు కవర్లను ప్రత్యేకమైన వస్త్రంతో చేస్తారట. అంతేకాకుండా, కవర్‌పై కావాలనే కన్‌ఫ్యూజ్ చేసేవిధంగా, చిరాకుపుట్టించేలా వివిధ రకాల డిజైన్లు వేస్తారట. సీట్లపై మరకలు దుమ్ము కనిపించకుండా ఉండేందుకే ఇలాంటి డిజైన్లు ఎంచుకుంటారని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు(Bus seat cover designs hide stains). డార్క్ రంగులు వాడటం వల్ల సీటుపై ఉండేమరకలు అస్సలు కనిపించవట. అంతేకాకుండా, కంటికి ఇబ్బందికరంగా ఉండే డిజైన్ల వల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు సీటును చూడలేక ముఖం తిప్పుకుంటారట. దీంతో, ఒకటీఅరా ఉండే మరకలు కూడా వారి దృష్టిలోకి రావట. ఇదంతా ప్రయాణికులను మరకల నుంచి ఏమార్చేందుకు రచించిన కుట్ర అని చెప్పుకుపోయాడా నెటిజన్.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..


అంతేకాదు. తన వాదనకు మద్దతుగా ఓ బస్సు వీడియో కూడా షేర్ చేశాడు. వీడియోలోని బస్సులో సీట్లను కాస్తంత దూరం నుంచి చూస్తే శుభ్రంగా కనిపించాయి. దాన్ని వాటిపై గట్టిగా చరిస్తే బోలెడంత దుమ్ము గాల్లోకి లేచింది. తన వాదనకు ఈ వీడియోనే ఆధారం అంటూ ఆ నెటిజన్ చెప్పుకొచ్చారు. అయితే, నెట్టింట్లో అనేక మంది నెటిజన్ వాదనను సమర్థించారు. తమకు ఈ విషయం చిన్నప్పుడే తెలుసని కొందరు చెప్పుకొచ్చారు. అందుకే తాను బయట నుంచి వచ్చాక దుస్తులు ఉతుక్కుంటానని, ఆ తరువాత తలారా స్నానం చేసిగానీ మంచంపై నడుం వాల్చనని కొందరు చెప్పుకొచ్చారు. ఇలా నెటిజన్లలో బాగా ఆసక్తికలిగిస్తున్న ఈ పోస్టు నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Viral: ఫోన్ చోరీ అయితే పోనీలే అనుకున్నాడు! మరో ఫోన్‌లో కొత్త సిమ్ కార్డు వేశాక భారీ షాక్..!

Updated Date - 2023-10-10T20:27:13+05:30 IST