eyes close while kissing: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు?... కారణం ఇదేనని తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-19T12:06:33+05:30 IST

eyes close while kissing: సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ముద్దు(kissing) పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఇలాంటి దృశ్యాలను సినిమాల్లోనూ చూస్తుంటాం. అయితే ముద్దు పెట్టుకునేటప్పుడు ఇలా కళ్లు ఎందుకు మూసుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా?

eyes close while kissing: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు?... కారణం ఇదేనని తెలిస్తే...

eyes close while kissing: సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ముద్దు(kissing) పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఇలాంటి దృశ్యాలను సినిమాల్లోనూ చూస్తుంటాం. అయితే ముద్దు పెట్టుకునేటప్పుడు ఇలా కళ్లు ఎందుకు మూసుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అంశంపై పరిశోధన(Research) చేసిన లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయల్ హోలోవే ఇంద్రియ అనుభవంపై సాగించిన ఒక అధ్యయనం ప్రకారం ముద్దుపెట్టుకునే సమయంలో మనసుకు ఇతర ఇంద్రియాల(senses)పై దృష్టి పెట్టడం కష్టమవుతుందని కనుగొన్నారు.

మనస్తత్వవేత్తలు సాండ్రా మర్ఫీ, పాలీ డాల్టన్ ఈ అంశంపై మాట్లాడుతూ ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్లు మూసుకోవడం(Closing the eyes) అనేది వారిద్దరూ చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనల(research) ప్రకారం భాగస్వాముల పెదవులపై ముద్దుపెట్టుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకుంటారని, ఆ సమయం(time)లో కళ్ళు తెరిచి ఉంటే బాహ్య విషయాలు వారి దృష్టిని మరలుతుందన్నారు.

ముద్దు పెట్టుకునేటప్పుడు తన భాగస్వామి(partner)కి భద్రత ఇవ్వాలని కోరుకుంటారన్నారు. అధ్యయనం(study)లో భాగంగా కొందరిని ముద్దు పెట్టుకునేటప్పుడు కొన్ని అక్షరాలు చదవమని కోరగా, అది కష్టమని వారు తెలిపారు. ఒక నివేదిక(Report) ప్రకారం ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు తెరిచి ఉంటే స్పర్శ అనుభూతి(feeling) తక్కువగా ఉంటుంది.

Updated Date - 2023-03-19T12:11:56+05:30 IST