ఏ కమోడ్ అయినా తెలుపు రంగులోనే ఎందుకుంటుంది? మురికి కనిపించేందుకే అనుకుంటే అవగాహన లేనట్లే... సరైన సమాధానం ఇదే..!

ABN , First Publish Date - 2023-04-09T06:51:24+05:30 IST

టాయిలెట్‌లోని కమోడ్(commode) తెలుపు రంగులో ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. దీని గురించి మాట్లాడే కొంతమంది టాయిలెట్‌లోని కమోడ్ తెలుపు రంగు(white color)లో ఉండటానికి కారణం...

ఏ కమోడ్ అయినా తెలుపు రంగులోనే ఎందుకుంటుంది? మురికి కనిపించేందుకే అనుకుంటే అవగాహన లేనట్లే... సరైన సమాధానం ఇదే..!

టాయిలెట్‌లోని కమోడ్(commode) తెలుపు రంగులో ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. దీని గురించి మాట్లాడే కొంతమంది టాయిలెట్‌లోని కమోడ్ తెలుపు రంగు(white color)లో ఉండటానికి కారణం... దానిపై మురికి చేరితే వెంటనే కనిపిస్తుందని చెబుతారు. అప్పుడు దానిని శుభ్రం చేయడం(cleaning) సులభమని అంటారు. మరికొందరు తెలుపు రంగు శుభ్రతకు గుర్తు అని, తెలుపు రంగు ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తుందని అంటారు. అందుకే కమోడ్‌ను తెలుపు రంగులో రూపొందిస్తారని చెబుతారు.

అయితే ఇది పూర్తి నిజం కాదు. నిజానికి కమోడ్ అనేది సిరామిక్(Ceramic) లేదా పింగాణీ అనే పదార్థంతో తయారవుతుంది. ఇది తెలుపు రంగులో ఉంటుంది. అందుకే కమోడ్ తెలుపు రంగులో కనిపిస్తుంది. అయితే కొన్ని కంపెనీలు పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో కూడా కమోడ్‌(commode)లను తయారు చేస్తుంటాయి. కానీ మార్కెట్‌లో వీటికి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. సిరామిక్ లేదా పింగాణీ అనేది ఒక ప్రత్యేక రకం మట్టితో తయారయిన పదార్థం.

ఇది అధిక నాణ్యత(Quality) కలిగిన ఇన్సులేటింగ్ పదార్థం. ఇది ఎక్కువగా విద్యుత్ సంబంధిత పనులలో ఇన్సులేటింగ్(insulating) పదార్థంగా ఉపయోగిస్తారు. అలాగే దీనిని టైల్స్, కమోడ్లు, పాత్రలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సిరామిక్ అనేది సిలికా, అల్యూమినా, మెగ్నీషియా, బోరాన్ ఆక్సైడ్(Boron oxide), జిర్కోనియం మొదలైన పదార్థాల మిశ్రమం నుండి తయారవుతుంది.

Tirumala: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

Updated Date - 2023-04-11T06:47:36+05:30 IST