first ac ticket booking: రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెంటనే సీటు నంబర్‌ను కేటాయించకపోవడం వెనుక కారణం ఇదే...

ABN , First Publish Date - 2023-03-30T09:28:49+05:30 IST

first ac ticket booking: ఫస్ట్ ఏసీలో సీట్ అలాట్‌మెంట్(Allotment) గురించి తెలుసుకునే ముందు, ఫస్ట్ ఏసీ కోచ్‌లో సీటు ఎలా కేటాయిస్తారో తెలుసుకుందాం.

first ac ticket booking: రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెంటనే సీటు నంబర్‌ను కేటాయించకపోవడం వెనుక కారణం ఇదే...

first ac ticket booking: ఫస్ట్ ఏసీలో సీట్ అలాట్‌మెంట్(Allotment) గురించి తెలుసుకునే ముందు, ఫస్ట్ ఏసీ కోచ్‌లో సీటు ఎలా కేటాయిస్తారో తెలుసుకుందాం. వాస్తవానికి, ఈ కోచ్‌లో విభిన్న క్యాబిన్‌(cabin)లు ఉంటాయి. కొన్ని క్యాబిన్లలో నాలుగు సీట్లు ఉంటే కొన్ని క్యాబిన్లలో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు రెండు సీట్లు ఉన్న క్యాబిన్‌లో ఇద్దరు పరిచయస్తులు ప్రయాణిస్తున్నప్పుడు వారు దానిని గదిగా ఉపయోగించవచ్చు. దీనిని క్యూబ్ అని కూడా అంటారు.

జంటలు లేదా ఇద్దరు కలిసి ప్రయాణించేవారు ఈ రకమైన క్యూబ్‌లో ప్రయాణించాలనుకుంటారు. ఎవరైనా ఫస్ట్ ఏసీ(First AC)లో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే, వారు నాలుగు సీట్ల క్యాబిన్‌లో చోటు పొందవచ్చు. ఇందులో పైన, దిగువన రెండు సీట్లు, ముందు రెండు సీట్లు ఉంటాయి. టికెట్ బుకింగ్(Ticket booking) ఆధారంగా ఫస్ట్ ఏసీలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు ఒక జంట టికెట్ బుక్ చేసుకుంటే, వారికి క్యూబ్ కేటాయిస్తారు.

సీట్ల సంఖ్య ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎవరైనా నలుగురు కలిసి టిక్కెట్లు బుక్ చేసుకుంటే వారికి క్యాబిన్(cabin) ఇస్తారు. అదే సమయంలో ఇద్దరు ప్రయాణికులకు ఒక క్యూబ్ కేటాయిస్తారు. ఎవరైనా ఒంటరిగా(Alone) ప్రయాణిస్తుంటే, వారికి లభ్యతను అనుసరించి టిక్కెట్లు కేటాయిస్తారు. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకున్న విధానాన్ని అనుసరించి వారికి సీటు కేటాయిస్తారు. అలాగే వివిధ ప్రాధాన్యతల ప్రకారం టిక్కెట్లు(Tickets) కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా సీట్ల కేటాయింపు(allotment) జరుగుతుంది.

Updated Date - 2023-03-30T10:01:28+05:30 IST