Doorway Effect: కొందరికి కోపం వస్తే తలుపులు బద్దలవ్వాల్సిందే.. వారు ఎందుకు ఇలా చేస్తారు?... పలు పరిశోధనల్లో ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2023-03-16T07:36:20+05:30 IST

Doorway Effect: ప్రపంచంలో చాలామంది తీవ్రమైన కోపానికి(anger) గురయినప్పుడు వారు ఇంటి తలుపులను(doors) గట్టిగా బాదుతుంటారు. పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది కోపంగా ఉన్నప్పుడు తలుపులపై గట్టిగా కొట్టడం(hard) ద్వారా తమ కోపాన్ని బయటపెడతారు.

Doorway Effect: కొందరికి కోపం వస్తే తలుపులు బద్దలవ్వాల్సిందే.. వారు ఎందుకు ఇలా చేస్తారు?... పలు పరిశోధనల్లో ఏం తేలిందంటే..

Doorway Effect: ప్రపంచంలో చాలామంది తీవ్రమైన కోపానికి(anger) గురయినప్పుడు వారు ఇంటి తలుపులను(doors) గట్టిగా బాదుతుంటారు. పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది కోపంగా ఉన్నప్పుడు తలుపులపై గట్టిగా కొట్టడం(hard) ద్వారా తమ కోపాన్ని బయటపెడతారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చర్య అనంతరం కొద్దిసేపటికే కోపం తగ్గుముఖం పడుతుంది.

అయితే దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి మనిషి మనస్తత్వం(mentality) దీని వెనుక ప్రధాన కారణంగా నిలుస్తుంది. అది ఏవిధంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కోపంతో ఊగిపోతున్నప్పుడు తలుపులు గట్టిగా కొట్టే చర్యకు డోర్‌వే ఎఫెక్ట్‌(doorway effect) అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. సైన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఇది ఒక రకమైన venting ప్రభావం. ఇది కోపాన్ని తగ్గిస్తుంది. మనం ఒక తలుపు తెరుచుకుని... మరొక తలుపు దగ్గరకు చేరుకున్నప్పుడు పాత జ్ఞాపకం(memory) కాస్త బలహీనపడుతుంది. అది కోపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక గది దాటి మరో గది తలుపు దగ్గరకు చేరగానే పాత సంగతులు మర్చిపోతారు.

అయితే, ఇది చాలా తక్కువ సమయంలో అంటే కొన్ని సెకన్లలోనే జరుగుతుంది. ఇలా కోపం తగ్గడానికి స్వల్ప సమయం(short time) సరిపోతుంది. మనస్తత్వశాస్త్రవేత్తలు దీనికి డోర్ ఎఫెక్ట్ లేదా డోర్ థ్రెషోల్డ్ థియరీ అని పేరు పెట్టారు. గాబ్రియేల్ ఎ. రాడ్వెన్స్కీ(Gabriel A. Radvensky) 2006 సంవత్సరంలో డోర్‌వే ఎఫెక్ట్‌ను మొదట అధ్యయనం(study) చేశారు. ఇందులో దాదాపు 300 మందిపై తొలి ప్రయోగం(experiment) చేశారు. మనిషి ఒక గది నుండి మరొక గదికి రావడానికి తలుపులను దాటినప్పుడు, మునుపటి గదికి చెందిన జ్ఞాపకం కొంత సమయం వరకు మసకబారుతుందని అధ్యయనం(study)లో తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బాండ్ విశ్వవిద్యాలయం(Bond University) కూడా 2021 సంవత్సరంలో డోర్‌వే ఎఫెక్ట్‌పై పరిశోధన చేసింది.

సైకాలజిస్ట్ ఆలివర్ బౌమాన్(Psychologist Oliver Bowman) ఈ పరిశోధనలో వాస్తవ గదులకు అదనంగా వర్చువల్ గదులను జోడించారు. అప్పుడు కూడా ఫలితం అలాగే ఉంది. స్థలం మారినప్పుడు బలమైన భావోద్వేగం(emotion) తేలికగా మారుతున్నది. ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు వేరే ప్రాంతానికి వెళ్లాలని నిపుణులు సూచించడానికి ఇదే ప్రధాన కారణం. తలుపు మూశాక కోపం తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. వాస్తవానికి, తలుపు నుండి వచ్చే శబ్దం(noise) మనస్సును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని నుండి అపరాధ భావన ఏర్పడుతుంది. పొరపాటు(mistake) జరిగిపోయిందని గుర్తు చేస్తుంది. సాధారణంగా డోర్ స్లామింగ్ అనేది టీనేజ్ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

Updated Date - 2023-03-16T07:58:40+05:30 IST