Tea-Water: టీ, కాఫీ తాగేముందు మంచినీళ్లను తాగే అలవాటుందా..? అయితే ఈ నిజాలు తప్పకుండా తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2023-07-25T19:15:44+05:30 IST

ఉదయం లేవగానే టీ, కాఫీలకు ముందు రెండు గ్లాసుల మంచినీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలతో కలిగే దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు.

Tea-Water: టీ, కాఫీ తాగేముందు మంచినీళ్లను తాగే అలవాటుందా..? అయితే ఈ నిజాలు తప్పకుండా తెలుసుకోండి..!

ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అసలు పొద్దున్నే కడుపులో ఇవీ పడకపోతే రోజంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుందని కొందరు చెబుతారు. కానీ, కొందరు టీ, కాఫీలకు ముందు నీళ్లు తాగితే మంచిదన్న విషయం మీకు తెలుసా? అసలు మీకే ఇలాంటి అలవాటు ఉంటే మీరు నిజంగా లక్కీనే. లేకపోతే మాత్రం ఈ అలవాటు కచ్చితంగా చేసుకోవాలి. దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో గుర్తుపెట్టుకుని తెలియనవారికి కూడా చెప్పాలి.


పొద్దున్న లేవగా ముందుగా చేయాల్సింది శరీరానికి తగినంత తేమ అందించడం. ఉదయం లేవగానే పరగడుపున కాఫీ, టీ తాగడంతో శరీరం తేమ కోల్పోతుంది. ఇది జీవక్రియలపై పెను ప్రభావం చూపిస్తుంది. టీ, కాఫీలకు ఉండే ఆమ్ల లక్షణం శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. కాబట్టి, ముందుగా రెండు గ్లాసుల మంచి నీరు తాగితే కాఫీ టీల చెడుప్రభాలకు దరి చేరకుండా వాటి రుచిని ఎంజాయ్ చేయచ్చు.

కాఫీ, టీలు అతిగా మరగపెట్టొద్దని పెద్దలు చెప్పడం మీరెప్పుడైనా విన్నారా. ఇంతకు మించి చద్ది మూట లేదంటే అతిశయోక్తి కాదేమో. అతిగా మరగబెట్టిన వాటి వల్ల కడుపులో ఆమ్లాల స్థాయి పెరిగి అల్సర్స్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.


కెఫీన్ క్రాష్.. ఈ పేరు చాలా మందికి తెలియకపోయినప్పటికీ కొందరు కచ్చితంగా దీని ఫలితాన్ని అనుభవించే ఉంటారు. కాఫీలోని థియోబ్రోమిన్ అనే రసాయనం కారణంగా కాఫీతాగిన కాసేపటికి కొందరికి బాగా అలసటగా అనిపిస్తుంది. దీనికి పరిష్కారం కూడా మంచి నీరే.

కాఫీ, టీలతో ఉన్న మరో ప్రధాన సమస్య పళ్లు గార పట్టడం. వీటిల్లో ఉండే టానిన్‌ అనే రసాయనమే దీనికి కారణం. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే పొద్దున్నే లేవగానే మంచినీరు తాగాలి. దీని వల్ల పళ్ల చుట్టు ఓపొర ఏర్పడి గార పట్టకుండా నిరోధిస్తుంది.

ఇక శరీరంలో జీవక్రియలను ఉత్తేజితం చేయడంలో నీటికి మించినది మరొకటి లేదు. శరీరానికి తగినంత మోతాదుల్లో నీరు తీసుకుంటే, అంతకుమించిన వైద్యం మరొకటి ఉండదని అనుభవజ్ఞులు చెబుతారు.

Updated Date - 2023-07-25T19:25:31+05:30 IST