Share News

Wife: నా భర్తకు విడాకులు ఇస్తున్నా.. ఇక ఈ గర్భం అవసరం లేదంటూ.. అబార్షన్‌ కోసం హైకోర్టు కెళ్లిందో మహిళ.. చివరకు..!

ABN , First Publish Date - 2023-10-18T13:41:32+05:30 IST

ఒకప్పుడు మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిడ్డల్ని మోసి కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Wife: నా భర్తకు విడాకులు ఇస్తున్నా.. ఇక ఈ గర్భం అవసరం లేదంటూ.. అబార్షన్‌ కోసం హైకోర్టు కెళ్లిందో మహిళ.. చివరకు..!

పెళ్ళి, ఆ తరువాత గర్భం దాల్చడం, పిల్లలను కనడం ఇవన్నీ ప్రతి మహిళ జీవితంలో చోటుచేసుకునేవే. కానీ ఈ మధ్యకాలంలో మహిళలు తమ గర్భం విషయంలో తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకప్పుడు మహిళలకు భర్త, అతని కుటుంబం నుండి ఏదైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులు ఎదురైనా చాలా ఓర్పుతో బిడ్డను మోసి వారికి జన్మనిచ్చేవారు. కానీ ఇప్పుడలా కాదు.. బంధాలు విడితీసుకున్నట్టే కడుపులో పెరుగుతున్న బిడ్డలమీద కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక వారి కారణాలు వారికుంటాయి. ఓ మహిళ 'నేను నా భర్తకు విడాకులు ఇస్తున్నాను.. ఇక నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నాకు అవసరం లేదు, దయచేసి అబార్షన్ కు పర్మిషన్ ఇవ్వండి' అంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీ హైకోర్టుకు(New Delhi High Court) ఓ గర్భవతి చేసిన విన్నపం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీకి చెందిన 31ఏళ్ల మహిళకు(31years women) 2023మే లో వివాహం జరిగింది. ఆమె తదుపరి నెల జూన్ లోనే తన నెలసరి మిస్ అయ్యింది. ఆమె డాక్టర్ తో టెస్టులు చేయించుకోగా గర్బం దాల్చినట్టు వైద్యులు దృవీకరించారు. ఆ తరువాత నుండి ఆమెకు అత్తారింట్లో నరకం మొదలైంది. ఆమె భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. జూలైలో ఒకసారి, ఆగస్టులో మరొకసారి ఆమె మీద శారీరక దాడి చేసాడు. పదేపదే తనమీద దాడి జరుగుతుంటే అవన్నీ భరించలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది.

Shocking: ఎన్నిసార్లు ఫోన్ చేసినా బయటకు రావడం లేదని.. అసలు ఆమెకు ఇల్లే లేకుండా చేసిన ప్రియుడు.. బాంబులేసి కూల్చేశాడు..!


తన భర్త పెట్టే ఇబ్బందులు భరించే ఓపిక తనకు లేదని అతని నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నానని, ఆ మేరకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆమె కోర్టుకు తెలిపింది. భర్తనుండి విడాకులు తీసుకుంటున్న క్రమంలో తనకు ఇక గర్బం వద్దని, తన 22వారాల గర్భాన్ని తొలగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆమె గర్భం తొలగించడం ఆమె ఆరోగ్యానికి సురక్షితమేనా కాదా తెలపవలసిందిగా ఎయిమ్స్(AIMS) వైద్యులను కోరింది. ఏ మహిళ అయినా తగిన కారాణాలు ఉంటే 24వారాలలోపు గర్భాన్ని తొలగించుకునే హక్కు కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది.

Success Story: ఈ ఫొటోలోని మహిళ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తోంది.. అసలు ఆమె ఏం చేస్తే ఇంత డబ్బు వస్తోందంటే..!


Updated Date - 2023-10-18T13:41:32+05:30 IST