Wife-Husband: భర్తతో పొరపాటున కూడా భార్య అనకూడని మాటలివీ.. సరదాకయినా ఈ కామెంట్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2023-09-08T12:14:53+05:30 IST

భార్యాభర్తల బందం ఎంత బలమైనదో అంతే సున్నితమైనది కూడా. . భార్యలు జోక్ గా కూడా ఈ విషయాలు భార్తల ముందు మాట్లాడితే ఆ బందం బలహీన పడిపోవడానికి ఎంతో కాలం పట్టదు.

Wife-Husband: భర్తతో పొరపాటున కూడా భార్య అనకూడని మాటలివీ.. సరదాకయినా ఈ కామెంట్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!

ప్రపంచంలో తల్లిదండ్రుల తరువాత అత్యంత విలువైన బంధం భార్యాభర్తల బంధం. మధ్యలో ముడిపడి చచ్చేవరకు ఈ బంధం తోడుటుంది. అయితే పెళ్లి చేసుకున్న తరువాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, కోపాలు సహజం. మగాళ్లు తమ కోపాన్ని అప్పటికప్పుడు చూపించి ఆ తరువాత మామూలైపోతారు. కానీ ఆడవారు అలా కాదు. కోపం, ఆవేశం, ఇతర భావోద్వేగాలు మనసులోనే ఉంచుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ కోపాన్ని, వెక్కిరింపును జోకుల రూపంలోనో లేక దెప్పిపొడుపు లానో వ్యక్తం చేస్తుంటారు. కానీ భార్యలు పొరపాటున కూడా భర్తల ముందు అనకూడని మాటలు కొన్ని ఉన్నాయి. ఎంతో దృఢమైన బంధాన్ని కూడా ఈ మాటలు బీటలు వారేలా చేస్తాయి. అవేంటో తెలుసుకోవడం ప్త్రతి మహిళకు చాలా ముఖ్యం.

పెళ్లి తరువాత బంధం భార్యాభర్తల మధ్య ఉంటుంది. కుటుంబాలు కేవలం సపోర్ట్ గా ఉంటాయి. బంధం బలపడాలన్నా, బీటలు వారాలన్నా ఇద్దరి ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటంది. పెళ్ళి తరువాత అమ్మాయిలు తమ బంధం గురించి వారి తల్లులతో చర్చిస్తారు. అయితే ఈ చర్చలలో అమ్మాయిల తల్లులు ఎప్పుడైనా 'అల్లుడేంటి అలా చేస్తాడు? అతని ప్రవర్తన చెడ్డగా ఉంది' లాంటి మాటలు అంటే వాటిని భర్త దగ్గర ప్రస్తావించకూడదు. ఎప్పుడైనా పొరపాటున జోక్ గా కూడా తల్లులు చేసిన విమర్మలను భర్త ముందు మాట్లాడకూడదు, 'మా అమ్మ నీ గురించి ఇలా చెప్పింది' అంటూ ఆమెను అడ్డం పెట్టుకుని భర్తను నిందించకూడదు. ఇలా చేస్తే భర్తకు భార్యకు మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి.

Curd: పెరుగు పులుపెక్కిందా..? ఈ టెక్నిక్‌తో దాని రుచిని మళ్లీ మార్చేయడం యమా ఈజీ..!



శుభలగ్నం సినిమాలో ఆమని వ్యక్తిత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇరుగు పొరుగు వారిని చూసి తమకు ఖరీదైన వస్తువులు లేవని బాధపడే మహిళలు నిరంతరం భర్తను వేధిస్తుంటారు. 'నువ్వు నాకు ఎప్పుడూ ఖరీదైన వస్తువులు కొనలేదు' అని భర్తతో అనకూడదు. భర్త సంపాదన ఎప్పుడూ భార్య, పిల్లలు, భవిష్యత్తు ప్రణాళికల కోసమే ఉపయోగిస్తుంటాడనే విషయం ఏ భార్యా మరచిపోకూడదు. ఖరీదైన బహుమతులు ఇవ్వలేదని భార్యలు, భర్తల్ని దెప్పిపొడుస్తుంటే భర్తలు ఆ గోల తప్పించుకోవడానికి అప్పులు చేయడం, తప్పులు చేయడం మొదలుపెడతారు. ఆ తరువాత బంధంలో అశాంతి తప్ప వేరే ఏమీ ఉండదు.

కొంతమంది మహిళలు భర్తల దగ్గర తమ స్థాయి వ్యక్తం చేయడానికి 'నేను వేరేవాళ్లని చేసుకుని ఉంటే మహారాణిలా బ్రతికేదాన్ని, ఏం చేస్తాం నిన్ను కట్టుకుని ఇలా గడిపేస్తున్నాను' అని అంటూంటారు. కానీ ఇలా ఎప్పుడూ మాట్లాడకూడదు. భర్తలు ఈ మాట జోక్ గా కూడా వినడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి మాటలు అంటూంటే వెంటనే ఆ అలవాటు మానేయండి.

అత్తమామలు ఎప్పుడూ తల్లిదండ్రులు కాలేరు అనే మాట చాలా చోట్ల వింటూంటారు. అత్తమామలు ఎంతమంచి వారైనా సరే అమ్మాయిలు కూడా వారిని తల్లిదండ్రులతో సమానంగా ఎప్పుడూ భావించలేరు. చాలామంది అత్తమామలతో పేచీలు పడుతుంటారు. వారితో ఉండటం ఇష్టం లేక వేరుగా వెళ్తుంటారు కూడా. అత్తారింట్లో ఏదైనా అసౌకర్యం ఉన్నా, అత్తింటి వారి ప్రవర్తన నచ్చకపోయినా అదను చూసి 'నువ్వే అనుకున్నా మీ ఇంట్లో వారు కూడా ఇంతేనా?' లాంటి మాటలు మాట్లాడకూడదు.

Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!


Updated Date - 2023-09-08T12:14:53+05:30 IST