Elephants Fighting: నడిరోడ్డుపై రెండు ఏనుగులు పోట్లాడితే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.. భయంతో వణికిపోయిన జనాలు..!

ABN , First Publish Date - 2023-05-17T15:57:10+05:30 IST

సాధారణంగా ఏనుగులు సాధు జంతువులు, తెలివైన జీవాలు. అనవసరంగా హింస జోలికి వెళ్లవు. అయితే తనకు ప్రమాదం ఉందంటే మాత్రం భీకరంగా పోరాటానికి దిగుతాయి. వేరే జాతి జీవులతోనే కాదు.. సాటి ఏనుగులతో కూడా ఫైటింగ్ చేస్తాయి

Elephants Fighting: నడిరోడ్డుపై రెండు ఏనుగులు పోట్లాడితే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.. భయంతో వణికిపోయిన జనాలు..!

సాధారణంగా ఏనుగులు (Elephants) సాధు జంతువులు, తెలివైన జీవాలు. అనవసరంగా హింస జోలికి వెళ్లవు. అయితే తనకు ప్రమాదం ఉందంటే మాత్రం భీకరంగా పోరాటానికి దిగుతాయి. వేరే జాతి జీవులతోనే కాదు.. సాటి ఏనుగులతో కూడా ఫైటింగ్ చేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో నడిరోడ్డుపై రెండు ఏనుగులు భీకరంగా పోట్లాడుకున్నాయి (Elephants Fighting). ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఏనుగులు హింసాత్మకంగా పోరాడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. రెండు భారీ అడవి ఏనుగులు పోట్లాడుకుంటుంటే నిజంగానే భయం వేస్తోంది. ఈ వీడియో చూస్తే ఏనుగులకు కూడా ఇంత కోపం ఉంటుందా? అని అనిపించకమానదు. ఆ ఏనుగుల ఫైటింగ్‌ను రోడ్డుపై వెళుతున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఒక్కరోజులోనే 44 వేల మంది వీక్షించారు.

Thief: కృష్ణుడి గుడిలో నగల చోరీ.. 9 ఏళ్ల తర్వాత తిరిగి పంపించేసిన దొంగ.. నగల మూటలో ఉన్న ఓ కాగితంలో అతడు రాసింది చదివి..!

``రెండు టైటాన్స్ పోరాడితే.. అడవి వణికిపోతుంద``ని సుశాంత నందా కామెంట్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``రెండు భారీ జంతువులు భీకరంగా పోట్లాడుకుంటుంటే పారిపోకుండా వీడియో తీసిన వ్యక్తి గుండె ధైర్యానికి సలామ్``, ``ఏనుగుల మధ్య ఆధిపత్య పోరు`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-05-17T15:57:10+05:30 IST