కనిపించకుండా పోయిన భార్య.. కొద్ది నెలల తర్వాత మార్కెట్లో ఓ వ్యక్తి పక్కన ప్రత్యక్ష్యం.. నిలదీసిన భర్తకు ఊహించని షాక్..!

ABN , First Publish Date - 2023-02-07T19:32:36+05:30 IST

ఆమె వివాహిత.. ముగ్గురు పిల్లలకు తల్లి.. కొన్ని నెలల క్రితం ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.. ఆమె కోసం భర్త, కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు.. పిల్లలు తల్లి కోసం తల్లడిల్లుతున్నారు.. కొన్ని నెలల తర్వాత ఆమె మార్కెట్లో మరో వ్యక్తితో కలిసి కనిపించింది.. నిలదీసిన భర్తకు కోలుకోలేని షాకిచ్చింది..

కనిపించకుండా పోయిన భార్య.. కొద్ది నెలల తర్వాత మార్కెట్లో ఓ వ్యక్తి పక్కన ప్రత్యక్ష్యం.. నిలదీసిన భర్తకు ఊహించని షాక్..!

ఆమె వివాహిత.. ముగ్గురు పిల్లలకు తల్లి.. కొన్ని నెలల క్రితం ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.. ఆమె కోసం భర్త, కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు.. పిల్లలు తల్లి కోసం తల్లడిల్లుతున్నారు.. కొన్ని నెలల తర్వాత ఆమె మార్కెట్లో మరో వ్యక్తితో కలిసి కనిపించింది.. నిలదీసిన భర్తకు కోలుకోలేని షాకిచ్చింది.. మార్కెట్లో భార్యాభర్తల నడుమ హై వోల్టేజ్ డ్రామా నడిచింది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి ముగ్గురినీ స్టేషన్‌కు తరలించి మాట్లాడుతున్నారు (Extra Marital Affair).

బీహార్‌లోని (Bihar) పర్వాల్‌పూర్ ప్రాంతానికి చెందిన బబ్లూ కుమార్‌కి ఆర్తీదేవితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సంవత్సరం క్రితం, ఆర్తి ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళింది. అక్కడ ధీరేంద్ర అనే వ్యక్తిని కలిసింది. ధీరేంద్రకు కూడా వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహం మొదలై క్రమంగా ప్రేమకు (Love Affair) దారి తీసింది. కొన్ని నెలల క్రితం ఆర్తి తన ఇంటి నుంచి వెళ్లిపోయి ధీరేంద్రతో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆర్తి కోసం బబ్లూ కుమార్, పిల్లలు ఎంతగానో వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు (Married Woman Absconded with Lover).

చనిపోయాడనుకుని పాతిపెట్టేశారు.. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో షాక్!

సోమవారం సాయంత్రం ధీరేంద్రతో కలిసి ఆర్తి మార్కెట్‌కు వెళ్లి బబ్లూ కుమార్ కంటపడింది. దీంతో ఆర్తిని బబ్లూ నిలదీశాడు. తనతో పాటు రావాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆర్తి నిరాకరించింది. తనకు పిల్లలు, భర్త వద్దని ప్రియుడే కావాలని తెగేసి చెప్పింది. మార్కెట్‌లో పెద్ద గొడవ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ముగ్గురిని స్టేషన్‌కు తరలించి పంచాయితీ నిర్వహించారు. ముగ్గురితో మాట్లాడి ఓ పరిష్కారం సూచించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-02-07T19:32:37+05:30 IST