Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!
ABN , First Publish Date - 2023-11-09T15:11:31+05:30 IST
పోలీస్ యూనీఫాం ధరించి ఇన్‌స్టా రీల్స్ చేసిన ఓ మహిళా కానిస్టేబుల్ చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఫొటోలోని కానిస్టేబుల్‌ను చూశారుగా! చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించింది. ఇక అంతా హ్యాపీ అనుకుంటూ ముందూవెనుకా ఆలోచించకుండా చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో ఆమె ఉద్యోగమే ఊడిపోయింది. యువత సోషల్ మీడియా మోజులో పడి ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారో చెప్పేందుకు మంచి ఉదాహరణ ఇది. ప్రస్తుతం ఈ యువతి ఉదంతం నెట్టింట్లోనే కాకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
కాస్‌గంజ్(Kasgunj) జిల్లాకు చెందిన ఆర్తీ సోలంకీ అనే కానిస్టేబుల్ నేటితరం యువతకు అసలైన నిర్వచనం. ఆమెకు ఇన్‌స్టాలో రీల్స్(Reels) చేయడం ఎప్పటినుంచో అలవాటు. నిత్యం ఏదోక వీడియోను జనాలతో పంచుకుంటూ ఉంటుంది. అయితే, ఈ యావ ఎక్కువైపోవడంతో ఇటీవల ఓ రోజు ఆమె ఏకంగా పోలీసు యూనీఫాం ధరించి వీడియో రికార్డు చేసింది(Constable records reels while on uniform). అమితాబ్ బచ్చన్, శతృఘ్ణ సిన్హా నటించిన 1980ల నాటి ఓ సినిమాలోని ఓ పాటకు లింప్ సింక్ చేస్తూ వీడియో చేసుకుంది. ఆ తరువాత దాన్ని నెట్టింట పంచుకుంది. ఓ పోలీసు ఇలాంటి వీడియో చేస్తే జనాలు ఊరుకోరు కదా! అందుకే వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. బోలెడన్ని కామెంట్స్, లైక్స్‌తో రచ్చరచ్చ చేశారు.
ఇదే చివరకు ఆర్తీ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది(constable suspended). ఆమె వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆర్తీని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ కూడా ప్రారంభించారు. దీంతో, ఆర్తీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె ఉదంతం అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది.