Woman: ఎంత పని చేశావమ్మా..? కాసేపట్లో నీ దగ్గరకు వస్తానమ్మా అంటూ కూతురికి ఆ తండ్రి ఫోన్ చేసిన రోజే..!
ABN , First Publish Date - 2023-08-28T12:24:21+05:30 IST
కూతురు అల్లుడి దగ్గర సంతోషంగా ఉంటున్నా దూరంగా ఉందనే బెంగ ఆ తండ్రిని వీడలేదు. ఈ క్రమంలోనే కూతురుకు ఫోన్ చేసి ;కాసేపట్లో నీదగ్గరకు వస్తానమ్మా' అని చెప్పాడు. కూతురు కూడా సరేనంది. కానీ..
మనుషుల ఆర్థికి పరిస్థితి అయినా వారి జీవనవిధానంలో ప్రతిబింబిస్తుంటుంది. కానీ మానసిక పరిస్థితి అంత తొందరగా బయటపడదు. ఆ తండ్రి తన కూతురును గుండెల మీద ఎత్తుకుని గోరుముద్దలు తినిపించి యువరాణిలా పెంచాడు. పెళ్లి వయసురాగానే ఓ మంచి కుర్రాడితో పెళ్ళి జరిపించాడు. కూతురు అల్లుడి దగ్గర సంతోషంగా ఉంటున్నా దూరంగా ఉందనే బెంగ ఆయన్ను వీడలేదు. ఈ క్రమంలోనే కూతురిని చూడాలని అనిపించింది. వెంటనే కూతురుకు ఫోన్ చేసి ;కాసేపట్లో నీదగ్గరకు వస్తానమ్మా' అని చెప్పాడు. కూతురు కూడా సరేనంది. కానీ కూతురింటికి చేరుకున్న తండ్రికి ఊహించని షాక్ తగిలింది. కూతురు ఇలా ఎందుకు చేసిందని ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.
కేరళ(Kerala) రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లా ఆర్యనాడ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆర్యనాడ్ లో బెన్సీ షాజీ(26), జోబిన్ అనే భార్యాభర్తలు గత నాలుగు నెలల నుండి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జోబిన్ కొరియర్ ఆఫీస్ లో వర్క్ చేస్తుండగా, బెన్సీ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తోంది. బెన్సీ తండ్రి ఆదివారం ఉేదయం బెన్సీకి ఫోన్ చేసి 'నిన్ను చూడాలని అనిపిస్తోందమ్మా నేను వస్తున్నాను. కాసేపట్లో నీముందు ఉంటాను' అని చెప్పాడు. దానికి బెన్సీ కూడా సరేనంది. ఆ తరువాత బెన్సీ భర్త జోబిన్ ఏదో పని మీద బయటకు వెళ్ళి కాసేపయ్యాక ఇంటికి తిరిగి వచ్చాడు. అతను ఇంటికి రాగానే ఇంట్లో బెన్సీ కనిపించలేదు. పడక గదిలో ఉందేమోనని చూడగా గది లోపలి నుండి గొళ్ళెం వేసినట్టు అర్థమైంది. అతను ఎంత బాదినా తలుపుతీయకపోవడంతో స్థానికుల సహాయంతో గది తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా బెన్సీ విగతజీవిగా కనిపించింది.
Health Tips: ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కొనేయండి.. ఇంతగా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే..
బెన్సీ తండ్రిది తిరువనంపురం జిల్లా వితుర లోని మారుతమల గ్రామమని తెలిసింది. కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదంటూ బెన్సీ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెన్సీ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ఆదివారం తిరువనంతపురంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.