Google Maps: మీ వల్లే నా భర్త చనిపోయాడంటూ గూగుల్‌పై కేసు పెట్టిందో భార్య.. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అవడంతో..!`

ABN , First Publish Date - 2023-09-23T19:58:54+05:30 IST

తెలియని ఏ ప్రాంతానికైనా వెళ్లి అడ్రస్ పట్టుకోవాలంటే అందరూ ఉపయోగించేది గూగుల్ మ్యాప్స్‌నే. ఎవరినీ అడగనవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా మనకు కావాల్సిన చిరునామాకు సులభంగా చేరుకోవచ్చు. అయితే ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అయితే మిస్ ఫైర్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.

Google Maps: మీ వల్లే నా భర్త చనిపోయాడంటూ గూగుల్‌పై కేసు పెట్టిందో భార్య.. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అవడంతో..!`

తెలియని ఏ ప్రాంతానికైనా వెళ్లి అడ్రస్ పట్టుకోవాలంటే అందరూ ఉపయోగించేది గూగుల్ మ్యాప్స్‌ (Google Maps)నే. ఎవరినీ అడగనవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా మనకు కావాల్సిన చిరునామా (Address)కు సులభంగా చేరుకోవచ్చు. అయితే ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అయితే మిస్ ఫైర్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. తాజాగా ఓ మహిళ తన భర్త మరణానికి గూగుల్ మ్యాప్స్ కారణమంటూ కోర్టులో దావా వేసింది. గతేడాది అమెరికా (America)కు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి బ్రిడ్జీ పైనుంచి కిందపడి మరణించాడు (suit against Google).

అమెరికాకు చెందిన వైద్య పరికరాల సేల్స్‌మేన్ అయిన ఫిలిప్ పాక్సన్ గతేడాది సెప్టెంబర్‌లో తన స్నేహితుడి ఇంట్లో బర్త్ డే వేడుకలను ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షం కురుస్తుండగా రాత్రి వేళలో ఇంటికి బయల్దేరాడు. ఆ ప్రాంతం అంతా కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని దానిని అనుసరిస్తూ డ్రైవింగ్ చేశాడు. దారిలో సగం కూలిపోయిన బ్రిడ్జి (Broken bridge) ఒకటి ఉంది. ఫాక్సన్ చూసుకోకుండా వెళ్లిపోవడంతో కారు 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న నీటిలో ఫిలిప్ పాక్సన్ మునిగి చనిపోయాడు.

Viral Video: ఇదేం పనమ్మా తల్లీ.. సోదరుడి అస్తికలను ఆ మహిళ ఇలా చేస్తోందేంటి..?

వాస్తవానికి ఆ బ్రిడ్జి కూలిపోయి చాలా సంవత్సరాలైంది. అయినా సరే గూగుల్ ఆ బ్రిడ్జి పై నుంచి దారి చూపించింది. ఆ బ్రిడ్జి కూలిపోయిందని చాలా మంది గూగుల్‌కు సమాచారం అందించారు. అయినా మ్యాప్స్‌ను అప్‌డేట్ చేయలేదు. గూగుల్ వల్ల తన భర్త చనిపోయాడని ఫాక్సన్ భార్య అలీసియా కేసు ఫైల్ చేసింది. అలీసియా సూట్‌పై గూగుల్ స్పందించింది. అలీసియా కుటుంబం పట్ల తాము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఆమె వేసిన పిటీషన్‌ను సమీక్షిస్తున్నామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2023-09-23T19:58:54+05:30 IST