Viral News: అమ్మ బాబోయ్.. ఈ మహిళకు ఇదేం తింగరి ఆలోచన.. 18 ఏళ్లుగా ఈ జీన్స్ ప్యాంట్లను ఏం చేస్తోందంటే..!

ABN , First Publish Date - 2023-05-03T14:56:44+05:30 IST

ఏ రోజూ ఉతక్కుండా 18 ఏళ్లుగా (18 Years) అవే బట్టలు వాడుతుంది. ఇది అబద్ధం కాదు. నిజం. అది ఎలానో తెలియాలంటే

Viral News: అమ్మ బాబోయ్.. ఈ మహిళకు ఇదేం తింగరి ఆలోచన.. 18 ఏళ్లుగా ఈ జీన్స్ ప్యాంట్లను ఏం చేస్తోందంటే..!
Viral News

మా అయితే జత బట్టలు ఎన్ని రోజులు వేసుకుంటారు. ఒకటి.. రెండ్రోజులు.. అంతకుమించి వాడితే కంపు కొడతాయి. చాలా మంది అయితే ఒకసారి వాడిన డ్రస్ మరొసటి రోజు వేసుకోవడానికి ఇష్టపడరు. బ్యాడ్ స్మెల్ వస్తుందేమోనన్న భయంతో వాడరు. వాష్ చేసుకున్నాకే మళ్లీ ఉపయోగిస్తారు. బట్టలు ధరించే విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే అలర్జీ, దురదలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఉతికిన తర్వాతనే వేసుకుంటారు. కానీ ఒకామె ఏ రోజూ ఉతక్కుండా 18 ఏళ్లుగా (18 Years) అవే బట్టలు వాడుతుంది. ఇది అబద్ధం కాదు. నిజం. అది ఎలానో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఇంగ్లాండ్‌‌ (England)లోని యార్క్‌షైర్‌కు చెందిన సాండ్రా విల్లిస్ అనే మహిళ (Woman).. 18 ఏళ్ల క్రితం జీన్స్ ప్యాంట్లను (Jeans) కొనుగులు చేసింది. అయితే ఏడాదికోసారి మాత్రమే వాటిని ఉపయోగిస్తోంది. వాటిపై ఇప్పటి వరకూ ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయకుండా అలానే ధరిస్తోందట. అంతే కాదు ఆమె మంచి సువాసన వెదజల్లే సెంటు కూడా వాడటంతో జీన్స్ చెమట వాసన రావడం లేదంట. దీంతో ఆమె బట్టలు ఉతకకుండానే ఏడాదికి ఒకసారి వాటిని ధరిస్తోంది. ఇంకో రెండేళ్లు కూడా వాటిని వాష్ చేయబోనని సాండ్రా చెప్పుకొచ్చింది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డ్ సృష్టించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

DJAK.jpg

ఈ వార్తపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది (Viral News). నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఉతకకుండా ఎలా వాడుతున్నారంటూ కొందరు ప్రశ్నించారు. నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తుడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని వివరించారు. నిజంగా వాటిని ఉతకాలనే ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన వద్ద ఇంకా చాలా జతల జీన్స్ ఉన్నాయని.. వీటిని కూడా ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయని సాండ్రా చెప్పుకురావడం విశేషం.

ఇది కూడా చదవండి: Bride: కలలో కూడా ఊహించని ఘటన.. పెళ్లయిన 5 గంటలకే వధువు మృతి.. వరుడు పక్కన ఉండగానే..!

Updated Date - 2023-05-03T14:59:07+05:30 IST