Wife: ఆస్కార్ లెవల్ యాక్టింగ్‌తో ఇరగదీసిన భార్య.. భర్తను చంపి పూజ సామాన్ల కోసం మార్కెట్‌కు.. తిరిగొచ్చి డ్రామా స్టార్ట్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-05-20T18:10:27+05:30 IST
రాత్రి భర్తను హత్య చేసి మర్నాటి ఉదయమే పూజ సామాన్ల కోసం మార్కెట్‌కు వెళ్లిందో మహిళ. ఇంటికొచ్చాక పెద్దగా ఏడుస్తూ డ్రామా ప్రారంభించింది. తాను మార్కెట్‌కు వెళ్లినప్పుడు భర్తను ఎవరో పొట్టనపెట్టుకున్నారని ఆరోపించింది. కానీ, మహిళ తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో నిందితురాలి బండారం మొత్తం బయటపడిపోయింది. ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్కార్ లెవెల్ యాక్టింగ్‌తో ఇరగదీసింతో మహిళ. భర్తను చంపాక బయటకు వెళ్లి ఇంటికొచ్చిన ఆమె తాను మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఎవరో తన భర్తను పొట్టనపెట్టుకున్నారని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పెద్ద డ్రామానే ప్రారంభించింది. ఒక్క క్లూతో ఆమె బండారం మొత్తం బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..ఝార్ఖండ్ రాష్ట్రం(Jharkhand) రాటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పూర్ గ్రామానికి చెందిన సోనీ దేవి, రాజ్‌కుమార్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. కానీ కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ వివాదం తలెత్తుతోంది. ఈ గొడవలతో విసిగిపోయిన ఆమె భర్తను హత్య చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం తన సోదరుడి సాయం కూడా తీసుకుంది.
ఈ నెల 16న రాత్రి భర్తపై కొడవలితో దాడి చేసి హత్య చేసింది. ఆ మరుసటి ఉదయం ఏమీ తెలియనట్టు పూజ్ సామాన్ల కోసం మార్కెట్‌కు వెళ్లింది. వచ్చాక రక్తపుమడుగులో పడి ఉన్న భర్తను చూసి పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించింది. దీంతో, ఇరుగుపొరుగు వారు వచ్చి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్‌కు వెళ్లివచ్చేసరికి భర్త విగతజీవిగా మారాడంటూ ఇంటికొచ్చిన పోలీసులకు చెప్పింది.
కానీ, నిందితులు బయట నుంచి లోపలికి వచ్చినట్టు పోలీసులకు ఎటువంటి ఆధారం లభించలేదు. దీంతో, ఇది ఇంటి దొంగల పనే అని వారు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో సోనీ దేవిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో బండారం మొత్తం బయటపడింది. దీంతో, వారు ఆమెను హత్యానేరం కింద అరెస్టు చేశారు.