ఆ గ్రామంలో వింత ఆచారాలు. మహిళలు 5 రోజుల పాటు దుస్తులు ధరించకూడదట.. భర్తలతో మాట్లాడకూడదట.. వాళ్లు కూడా..!
ABN , First Publish Date - 2023-02-14T19:50:23+05:30 IST
గ్రామంలో వింత పండగ..మహిళలు 5 రోజులు పాటు దుస్తులు ధరించరు.. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా..
ఇంటర్నెట్ డెస్క్: విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలకు నిలయం భారత్. సాంస్కృతిక వైవిధ్యానికి అసలైన నిర్వచనంగా ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక మనదేశంలో పాటించే కొన్ని సంప్రదాయాలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) జరుపుకునే ఓ పండుగలో మహిళలు సాధారణ దుస్తులు ధరించకుండా ఐదు రోజులు పాటు గడుపుతారట. దీని వెనుకో ఆసక్తికరమైన పురాణ గాధ కూడా ఉంది.
కుల్లు జిల్లాలోని(Kullu District) పీణీ గ్రామ ప్రజలు భాద్రపద మాసం మొదట్లో ఐదు రోజుల పాటు ఈ పండగ(Festival) నిర్వహిస్తారు. ఈ క్రమంలో గ్రామంలోని స్త్రీ,పురుషులు పలు నిబంధనలు పాటిస్తారు. ఈ ఐదు రోజులు స్త్రీలు తమ సాధారణ దుస్తులు ధరించరు(Woman don't wear clothes). ఇందుకు బదులుగా ఉన్నితో చేసిన ప్రత్యేకమైన వస్త్రంతో శరీరాన్ని కప్పుకుంటారు. ఇక వివాహితలు తమ భర్తలకు దూరంగా ఉంటారు. ఎదురు పడినా పలకరించుకోరు..నవ్వులు కూడా చిందించరు. ఇక పురుషులు కూడా ఈ ఐదు రోజులు పరమపవిత్రంగా గడుపుతారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ రూల్స్ తూచాతప్పకుండా పాటించని పక్షంలో వారి ఇలవేల్పుకు ఆగ్రహం కలుగుతుందని, ఫలితంగా గ్రామంలోని సుందరమైన స్త్రీలు కనిపించకుండా పోతారని గ్రామస్థులు నమ్ముతారు.
ఈ కట్టుబాటు వెనుక ఓ పురాణ గాధ ఉంది. అప్పట్లో గ్రామాన్ని కొందరు రాక్షసులు వేధించేవారు. గ్రామంలోని మహిళలను ఎత్తికెళ్లిపోయేవారు. ఊరి ప్రజల అవస్థలను గమనించిన లాహువా ఘోండ్ అనే దేవత రాక్షసులను సంహరించి గ్రామస్థులను రక్షించారట. నాటి నుంచి ఆ దేవతను కొలుస్తున్న గ్రామస్థులు ప్రతి ఏటా ఈ పండగ జరుపుకుంటారు. పండగకు సంబంధించిన సంప్రదాయాలను తూచాతప్పకుండా పాటిస్తూ వస్తున్నారు.