Viral: బాబోయ్.. ఈ కుక్క మామూలు కాదు.. మహిళ తనను కిస్ చేయగానే..
ABN , First Publish Date - 2023-10-09T16:59:31+05:30 IST
పెంపుడు కుక్కకు ముద్దిచ్చిన ఓ మహిళ కుక్క ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. మహిళ తనను కిస్ చేసినట్టుగానే కుక్క కూడా మహిళను కిస్ చేసి ఆశ్ఛర్యపరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషంటే ఇష్టపడే మరో జీవి ఏదైనా ఉందంటే అతి కుక్క మాత్రమే. యజమానుల రక్షణ కోసం పెంపుడు కుక్కలు తమ ప్రాణాలను అడ్డేసేందుకు కూడా వెనకాడవు. ఒంటరితనంలో బాధపడేవారు పెంపుడు కుక్కలతో స్వాంతన దక్కుతుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. యజమానుల విషయంలో కుక్కలు ఎలా ఫీలవుతాయో ప్రత్యక్షంగా చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. వీడియో చూసిన వారు ఇకపై తాము కూడా ఓ కుక్కను పెంచుకుంటామని చెప్పారు(Woman kisses dog it kisses her).
Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తన పంపెడు కుక్కను ఓ మహిళ పక్కనే కూర్చోబెట్టుకుంది. కాసేపు దాన్నే తదేకంగా చూసి ఆ తరువాత దానికో కిస్ ఇచ్చింది. ఆ తరువాత క్షణకాలం పాటు ఆలోచించాక కుక్క కూడా సరిగ్గా అదే విధంగా ఓ కిస్ ఇచ్చింది. దీంతో, మహిళ సంబరానికి అంతేలేకుండా పోయింది.
సాధారణంగా పెంపుడు జంతువులపై మనషులకు వల్లమాలిన అభిమానం ఉంటుంది. కానీ అవి తమకు గురించి ఏమనుకుంటాయనే విషయంపై మాత్రం అంతస్పష్టత ఉండదు. యజమాని కనబడగానే తోకే ఉపేసే కుక్కలు కూడా అప్పడప్పుడూ అంటీముట్టనట్టుగానే ఉంటాయి. కానీ ఈ వీడియోలోని కుక్క మాత్రం మహిళ మనసు అర్థం చేసుకున్నట్టు ప్రవర్తించింది. అలా రెస్పాండైతే యజమాని మనసు మురిసిపోతుందని భావించిందో ఏమోగానీ తనూ ఓ ముద్దిచ్చి మహిళ సంబరపడిపోయేలా చేసింది.
Viral Video: వామ్మో.. పాకిస్థానీలు ఇలా ఆలోచిస్తారా? భారతీయుల్లో ఆశ్చర్యం!
ఇక వీడియో చూసిన నెటిజన్లు ఏ రేంజ్‌లో రెస్పాండవుతున్నారో మాటల్లో చెప్పడం కష్టం. తమ పెంపుడు కుక్కలు కూడా ఇలాగే ఉంటాయంటూ అనేక మంది కామెంట్ చేశారు. పెంపుడు కుక్క వెంటన ఉంటే తమకు ఒంటరితనం దరిచేరదని కొందరు చెప్పుకొచ్చారు. మరి కొందరేమో గతంలో తాము పెంపుడు కుక్కలను పెంచుకున్న నాటి తీపి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ఈ కుక్క చాలా తెలివి గలది లాగా ఉంది అంటూ ఇంకొందరు అభాప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్యమ ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
Indians in Israel: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎంతమందంటే..!