Viral: ఒక ల్యాంప్ కొనడం కోసం ఐకియా స్టోర్‌కు వెళ్లింది.. షాపింగ్ మొత్తం చేసిన తర్వాత అర చేతిలో ఆరు అడుగుల బిల్లు!
ABN , First Publish Date - 2023-08-21T16:11:55+05:30 IST
షాపింగ్ చేసేందుకు వెళ్లినపుడు చాలా మంది ఎదుర్కొనే అతి ప్రధాన సమస్య తాము తీసుకెళ్లిన లిస్ట్‌ను ఫాలో కాకపోవడం. మాల్‌లోని వస్తువులను చూసి టెంప్ట్ అయి తమ జాబితాలో లేనివి కూడా కోనేసి భారీగా ఖర్చు చేస్తారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ మహిళకు ఐకియా స్టోర్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది.
షాపింగ్ (Shopping) చేసేందుకు వెళ్లినపుడు చాలా మంది ఎదుర్కొనే అతి ప్రధాన సమస్య.. తాము తీసుకెళ్లిన లిస్ట్‌ను ఫాలో కాకపోవడం. మాల్‌లోని (Shopping Mall) వస్తువులను చూసి టెంప్ట్ అయి తమ జాబితాలో లేనివి కూడా కోనేసి భారీగా ఖర్చు చేస్తారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లోని ఓ మహిళకు ఐకియా స్టోర్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ మహిళ ఓ ల్యాంప్ (Lamp) కొనడం కోసమని ఐకియా స్టోర్‌కు వెళ్లింది. చివరికి ఆమె ఆరు అడుగుల పొడవు మేర బిల్లు వచ్చేంతగా షాపింగ్ చేసేసింది. ఆ బిల్లు ఆమె పొడవుకు దాదాపు సమానంగా ఉంది.
హైదరాబాద్‌కు చెందిన సమీర అనే యువతి ఇటీవల ఐకియా స్టోర్ (Hyderabad IKEA Store)లో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో తన అంత పొడవున్న బిల్లు (Bill)ను ఆమె చూపిస్తోంది. ``ఒక ల్యాంప్ కొనడానికి ఐకియా స్టోర్‌కు వెళ్లాను. కానీ, ఆ ల్యాంప్ కొనడం మర్చిపోయాను`` అని కామెంట్ చేసింది. పది రోజుల క్రితం ఆమె చేసిన ట్వీట్‌ను ఇప్పటివరకు 2.4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Viral Video: పాపం.. ఆ దొంగల టైమ్ బాగాలేదు.. ఇంట్లోంచి పారిపోతున్న వారిని లాక్కొచ్చి మరీ కొట్టాడు.. వీడియో వైరల్!
``ఇది పూర్తిగా ధనవంతుల సమస్య``, ``చాలా నిజం. నేను మరోసారి ఐకియాకు వెళ్లాలంటే భయపడుతున్నా``, ``ఐకియాలో కొనుగోలు చేసిన ల్యాంప్ నా వద్ద ఉంది. 50 శాతం డిస్కౌంట్ తో దాన్ని మీరు తీసుకోండి``, ``కస్టమర్‌లను టెంప్ట్ చేసే విధంగానే ఐకియా స్టోర్‌ను డిజైన్ చేశారు``, ``అందుకే అది ఐకియా. కంగ్రాట్స్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.