Viral: కరోనా వల్ల భార్య, కొడుకు మృతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కోడలి నుంచి జీవనభృతి కోరుతూ ఆ మామ కోర్టుకెళ్తే..!

ABN , First Publish Date - 2023-08-28T16:16:01+05:30 IST

ఆ వ్యక్తి వృద్ధుడు.. కరోనా సమయంలో ఆ వ్యక్తి భార్య, కొడుకు మరణించారు.. దీంతో అతడిని ఒంటరిగా వదిలేసి కోడలు బయటకు వెళ్లిపోయింది.. అప్పట్నుంచి ఆ వృద్దుడు ఒంటరి అయిపోయాడు.. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. తన ఆస్తి అంతా అనుభవించిన కోడలు తనను ఆదుకుంటుందనుకున్నాడు..

Viral: కరోనా వల్ల భార్య, కొడుకు మృతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కోడలి నుంచి జీవనభృతి కోరుతూ ఆ మామ కోర్టుకెళ్తే..!

ఆ వ్యక్తి వృద్ధుడు.. కరోనా సమయంలో ఆ వ్యక్తి భార్య, కొడుకు మరణించారు.. దీంతో అతడిని ఒంటరిగా వదిలేసి కోడలు బయటకు వెళ్లిపోయింది.. అప్పట్నుంచి ఆ వృద్దుడు ఒంటరి అయిపోయాడు.. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. తన ఆస్తి అంతా అనుభవించిన కోడలు (Daughter-in-law) తనను ఆదుకుంటుందనుకున్నాడు.. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు.. దీంతో ఆ మామ (Father-in-law) కోర్టుకు వెళ్లాడు.. ఆరు నెలల పాటు సుదీర్ఘంగా ఈ కేసును విచారించిన కోర్టు తుది తీర్పు వెలువరించింది.

మహారాష్ట్ర (Maharashtra)లోని సతారా సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం (Satara court) ఆ వృద్ధుడికి ఊరట కలిగించింది. మామ పోషణార్థం కోడలు నెలకు రూ.5 వేలు అందించాలని తీర్పునిచ్చింది. అతని భార్య, కొడుకు మరణించినందున మామయ్యకు కోడలు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సురూర్ నివాసి మహీంద్రే భార్య, కుమారుడు ప్రవీణ్ 2021లో కరోనావైరస్ సోకి మరణించారు. ప్రవీణ్ మరణానంతరం అతని భార్య జ్యోతి మామగారిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. పుణెలో ఓ కంపెనీలో చేరి నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తోంది.

Snake in AC: బాబోయ్.. ఏసీలోంచి సడన్‌గా బయటికొచ్చి.. ఎలుకను పట్టేసుకున్న పాము.. ఎలా లోపలికి తీసుకెళ్తోందో చూస్తే..!

మహీంద్రే గత కొన్నేళ్లుగా గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యం కోసం ఇరుగుపొరుగు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వాయిదాలు తానే చెల్లిస్తున్నాడు. కోడలు నెలకు రూ.15,000 భరణం ఇవ్వాలని మహీంద్రే కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తుపై విచారణ గత ఆరు నెలలుగా జరుగుతుండగా, ఆ మహిళ గైర్హాజరైంది. పదేపదే నోటీసులు పంపినప్పటికీ, ఆమె ఒక్కసారి మాత్రమే హాజరైంది. తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు మామకు ప్రతి నెల రూ.5 వేలు భరణం చెల్లించాలని కోడలిని ఆదేశించింది.

Updated Date - 2023-08-28T16:16:01+05:30 IST