Share News

Social Media: చనిపోయేముందు ఆ మహిళ రాసిన వీలునామా చెల్లదంటూ సంచలన తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-11-27T21:13:55+05:30 IST

ఆ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.. చనిపోబోయే ముందు వీలునామా రాయాలని నిర్ణయించుకుంది.. ఆమె తన పేర ఉన్న ఆస్తులన్నీ తన కూతురికి చెందాలని పేర్కంటూ వుయ్ ఛాట్ అనే చైనీస్ మెసేజింగ్ సర్వీస్ యాప్‌లో వీలు రాసింది. కొద్ది రోజుల అనంతరం ఆమె మరణించింది.

Social Media: చనిపోయేముందు ఆ మహిళ రాసిన వీలునామా చెల్లదంటూ సంచలన తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ఆ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.. చనిపోబోయే ముందు వీలునామా (Last Will) రాయాలని నిర్ణయించుకుంది.. ఆమె తన పేర ఉన్న ఆస్తులన్నీ తన కూతురికి చెందాలని పేర్కంటూ వుయ్ ఛాట్ (WeChat) అనే చైనీస్ మెసేజింగ్ సర్వీస్ యాప్‌లో వీలు రాసింది. కొద్ది రోజుల అనంతరం ఆమె మరణించింది. ఆమె మరణించిన తర్వాత కథ అడ్డం తిరిగింది. చనిపోయిన మహిళ తల్లి కోర్టుకు ఎక్కడంతో సంచలన తీర్పు వెలువడింది (Viral News).

చైనాలోని (China) హాంగ్‌పూ జిల్లాకు చెందిన జావో అనే మహిళ కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తన పేర ఉన్న ఆస్తులన్నీ తన కూతురు అయిన కియాన్‌కు చెందాలని కోరుకుంది. ఆ మేరకు వీలునామా రాసి దానిని వుయ్ ఛాట్‌లో పోస్ట్ చేసింది. కొద్ది రోజుల తర్వాత జావో మరణించింది. అయితే జావో మరణం తర్వాత ఆమె తల్లి, కియాన్ అమ్మమ్మ అయిన సున్ రంగ ప్రవేశం చేసింది. ఆ ఆస్తుల మీద తనకు కూడా హక్కు ఉందని వాదించింది. ఇరు వర్గాలు కోర్టుకు వెళ్లాయి.

Viral: విపరీతమైన కడుపునొప్పితో వచ్చిన 27 ఏళ్ల యువతి.. వింత వింత లక్షణాలు విని డాక్టర్లకు డౌట్.. స్కాన్ చేసి చూస్తే..!

కేసును పరిశీలించిన న్యాయమూర్తి జావో రాసిన వీలునామా చెల్లదని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో రాసిన వీలునామాలకు ఎలాంటి విలువా ఉండదని తెలిపారు. చైనా న్యాయాల ప్రకారం ఆరు విధాలుగా వీలునామా రాయవచ్చని, అయితే వుయ్ ఛాట్‌ వీలునామాకు మాత్రం న్యాయపరంగా విలువ ఉండదని తెలిపారు. ఏ దేశంలోనైనా చట్టం గుర్తించే విధంగా వీలునామా రాయకపోతే అది చెల్లదని అందరూ గుర్తించాల్సిందిగా ఈ కేసు చాటి చెబుతోంది.

Updated Date - 2023-11-27T21:13:58+05:30 IST