పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు.. మోసం చేశారంటూ భార్య విడాకుల కేసు.. ఇంతకీ భర్తకు ఉన్న సమస్య ఏంటంటే..
ABN , First Publish Date - 2023-02-15T18:19:50+05:30 IST
ఆమె తనకు తాను ఎంత నచ్చచెప్పుకున్నా భర్త విషయంలో అత్తింటివారు తనను మోసం చేశారనే విషయాన్ని కన్వీన్స్ కాలేకపోయింది. దీంతో
పెళ్ళయి ఒకటిన్నర ఏడాదే.. కానీ ఆ మహిళ చాలా విసిగిపోయింది. సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళి కౌన్సిలింగ్ కూడా తీసుకుంది. ఆమె తనకు తాను ఎంత నచ్చచెప్పుకున్నా భర్త విషయంలో అత్తింటివారు తనను మోసం చేశారనే విషయాన్ని కన్వీన్స్ కాలేకపోయింది. దీంతో 'నా భర్త కుటుంబం నన్ను మోసం చేసింది నాకు నా భర్త నుండి విడాకులు కావాలి' అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ మహిళకు ఒకటిన్నర సంవత్సర క్రితం పెళ్లయ్యింది. అయితే పెళ్లయిన రోజు నుండి ఆమెకు నిద్ర కరువయింది. కారణం ఏమిటంటే ఆమె భర్తకు థొరెటల్(throttle problem) సమస్య ఉందట. దీనివల్ల అతను నిద్రలో ఒకటే గురక (snoring)పెడుతున్నాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా లేదు. వారికి పెళ్ళయి ఒకటిన్నర సంవత్సరం అయినా పిల్లలు కూడా లేరు. భర్త గురకతో విసిగిపోయిన ఆ మహిళ నాకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు ఆమె నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందేమో అని సైకియాట్రిస్ట్(psychiatrist) ను కలిసి కౌన్సిలింగ్ కూడా తీసుకుంది. కానీ ఎంతకూ ఆమెలో మార్పు లేదు. భర్త తరపు వాళ్ళు చేసింది మోసమేనని ఆమె గట్టిగా అభిప్రాయపడుతోంది. భర్త డిస్టర్బెన్స్ కారణంగా ఈ మహిళ గత కొంతకాలంగా నిద్రకు సంబంధించి సమస్యతో (sleeping problems) ఇబ్బంది పడుతోందని ఈమె తరపు లాయర్ చెప్పారు. ఇబ్బంది పడుతూ బంధంలో ఉండటం కంటే విడిపోవడమే మానసిక సమస్యలకు పరిష్కారం అని అన్నారు. కాగా దీనికే విడాకులా అని కొందరు నెటిజన్లు బుగ్గలు నొక్కుకుంటుంటే, అనుభవించేవారికి తెలుస్తుంది ఆ బాధ అని మరికొందరు మహిళకు మద్దతుగా నిలిచారు. కొసమెరుపు ఏంటంటే.. భారతదేశంలో భర్త గురక కారణంగా విడాకులు తీసుకుంటున్న మహిళల శాతం రోజురోజుకు పెరుగుతోందట. గురక రాయుళ్ళూ.. గురకకు అడ్డుకట్ట ఏదైనా వేయండి మరి.