Jawan Movie: బాబోయ్.. షారూఖ్ అంటే మరీ ఇంత అభిమానమా..? ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ తీసుకుని మరీ థియేటర్‌కు వెళ్లి..!

ABN , First Publish Date - 2023-09-11T17:50:26+05:30 IST

చాలా రోజులుగా హిట్ కోసం పరితపించిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌కు 2023 మరపురాను అనుభూతులను మిగిల్చింది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన ``పఠాన్`` సినిమా షారూక్ వరుస వైఫల్యాలకు చెక్ పెట్టి హిట్‌గా నిలిచింది. ఇక, తాజాగా విడుదలైన ``జవాన్`` సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Jawan Movie: బాబోయ్.. షారూఖ్ అంటే మరీ ఇంత అభిమానమా..? ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ తీసుకుని మరీ థియేటర్‌కు వెళ్లి..!

చాలా రోజులుగా హిట్ కోసం పరితపించిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌ (Shah Rukh Khan)కు 2023 మరపురాను అనుభూతులను మిగిల్చింది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన ``పఠాన్`` (Pathaan Movie) సినిమా షారూక్ వరుస వైఫల్యాలకు చెక్ పెట్టి హిట్‌గా నిలిచింది. ఇక, తాజాగా విడుదలైన ``జవాన్`` (Jawan Movie) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు తొలి షో చూసేందుకు ఓ అభిమాని (Shah Rukh Fan) చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరు (Bengaluru)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు షారూక్‌కు వీరాభిమాని. ఈ నెల 7వ తేదీన రిలీజ్ అయిన ``జవాన్`` సినిమా తొలి షో మిస్ కాకూడదనుకున్నాడు. అందుకే ఏకంగా తన ల్యాప్‌టాప్ తీసుకుని థియేటర్‌కు వెళ్లిపోయాడు. థియేటర్‌లో ఓ పక్క సినిమాను ఆస్వాదిస్తూనే మరో పక్క తన వర్క్ చేసుకున్నాడు (Work From Theatre). ఆ థియేటర్లో ఉన్న వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.

Man Hole Dance: బాబోయ్.. ఏంటీ వింత..? నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ మూత ఎందుకిలా పదే పదే పైకి లేస్తోందంటే..!

ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. షారూక్ అభిమానులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ``షారూక్ సినిమా తొలి రోజు తొలి షో చూడడం మధురానుభూతి``, ``జవాన్ మ్యానియా`` అని కొందరు కామెంట్లు చేశారు. కొందరు మాత్రం ఆ వ్యక్తిపై మండిపడ్డారు. థియేటర్లో పని చేయడం వల్ల అటు సినిమాను ఆస్వాదించలేడని, ఇటు పనీ సక్రమంగా చేయలేడని కొందరు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-11T17:50:26+05:30 IST