world fastest train: కళ్లు మూసి తెరిచేలోగా గమ్యస్థానానికి చేర్చే ఆ రైలు... పట్టాల మీద నడవదు.. గంటకు ఎంత వేగంతో పరిగెడుతుందంటే...
ABN , First Publish Date - 2023-03-23T07:57:13+05:30 IST
world fastest train: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు జపాన్ లేదా అమెరికాలో లేదు... మన దేశానికి పొరుగున ఉన్న చైనాలో ఉంది.
world fastest train: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు జపాన్ లేదా అమెరికాలో లేదు... మన దేశానికి పొరుగున ఉన్న చైనాలో ఉంది. షాంఘై మాగ్లేవ్(Shanghai Maglev) అనే ఈ రైలు షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయాన్ని లాంగ్‌యాంగ్ రోడ్ స్టేషన్‌కు కలుపుతుంది. షాంఘై మాగ్లెవ్ రైలు గరిష్ట వేగం గంటకు 460 కిలోమీటర్లు. ఈ సూపర్ స్పీడ్ రైలు(Super speed train) సాయంతో 700 కిలోమీటర్ల దూరాన్ని సుమారు ఒకటిన్నర నుండి రెండు గంటల్లో అధిగమించవచ్చు.
ఈ రైలుకున్న ఒక ప్రత్యేక అంశమేమంటే దీనికి సంప్రదాయ ఇనుప చక్రాలు(Iron wheels) లేవు. దీనికి బదులుగా ఇది మాగ్నెటిక్ లెవిటేషన్(Magnetic levitation) (మాగ్లెవ్)తో నడుస్తుంది. ఈ టెక్నిక్‌లో ట్రాక్‌లపై అయస్కాంత ప్రభావం(Magnetic effect) ఉంటుంది. రైలు ఈ ట్రాక్‌లకు కొద్దిగా పైన గాలిలో ఉంటుంది. ట్రాక్‌ల అయస్కాంత ప్రభావం కారణంగా, రైలు స్థిరంగా ఉంటుంది. ఎటువంటి శబ్దం లేకుండా అధిక వేగం(High speed)తో నడుస్తుంది.
మాగ్లెవ్ టెక్నాలజీ(Maglev technology) మొదట జర్మనీలో ఉపయోగించారు. ఈ మాగ్లెవ్ రైలు గత దశాబ్ద కాలంగా చైనాలో నడుస్తోంది. తాజాగా చైనా(China) గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే మాగ్లెవ్ రైలును సిద్ధం చేసింది. ఈ రైలు పొడవు 153 మీటర్లు, వెడల్పు 3.7 మీటర్లు. ఎత్తు 4.2 మీటర్లు. దీనిలో మొత్తం 574 మంది ప్రయాణికులు(Passengers) ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ క్లాస్(First class), సెకండ్ క్లాస్, ఎండ్ సెక్షన్ ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు చైనా పౌరులతో పాటు, విదేశీయులు(Foreigners) కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.