worlds highest atm: అది సెల్ఫీలకు, వీడియోలకు పేరుగాంచిన ఏటీఎం... ‘ఇదేంది సామీ’ అనుకున్నారా?.. అయితే చదవండి మరి!

ABN , First Publish Date - 2023-03-20T07:16:40+05:30 IST

worlds highest atm: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి(Financial situation) మరింత దిగజారింది. అక్కడి ప్రజలు తిండి గింజలకు సైతం తహతహలాడిపోతున్నారు.

worlds highest atm: అది సెల్ఫీలకు, వీడియోలకు పేరుగాంచిన ఏటీఎం... ‘ఇదేంది సామీ’ అనుకున్నారా?.. అయితే చదవండి మరి!

worlds highest atm: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి(Financial situation) మరింత దిగజారింది. అక్కడి ప్రజలు తిండి గింజలకు సైతం తహతహలాడిపోతున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం(Inflation) ఎంతగా దిగజారిందంటే ఏదైనా ఏటీఎం నుంచి ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఆ ఏటీఎం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. కాగా పాకిస్తాన్‌(Pakistan)లోని ఒక ఏటీఎం పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. దీని గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలోని ఏటీఎం పాకిస్తాన్‌లో ఉంది.

కొంతమంది ఈ ఏటీఎంను సెల్ఫీ ఏటీఎం అని కూడా పిలుస్తారు. ఈ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్లేవారు.. సెల్ఫీ(Selfie) దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ ATMకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్‌లో చాలాచోట్ల కొండ ప్రాంతాలు(Hilly areas) ఉన్నాయి. ఈ ATM ఈ కొండ ప్రాంతాలలో ఉంది. చైనా- పాకిస్తాన్ మధ్య ఖుంజ్రాబ్ పాస్(Khunjrab Pass) అనే సరిహద్దు ఉంది. ఈ ప్రదేశం చుట్టూ మంచు కొండలు ఉన్నాయి. ఏడాది పొడవునా ఇక్కడ మంచు కురుస్తుంది.

ప్రపంచం(world)లోనే అత్యంత ఎత్తయిన ATM ఈ ప్రదేశంలో ఉంది. ఈ ATM పాకిస్తాన్ నేషనల్ బ్యాంక్‌కి చెందినది. ఈ ATM పనిచేయడానికి సౌర, పవన శక్తి(wind power) అవసరమవుతుంది. ఈ ATMను 2016వ సంవత్సరంలో నెలకొల్పారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌(Guinness World Record)లో చోటు సంపాదించుకుంది. ఈ ATM 4693 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తున ఉన్న ఈ ఏటీఎంలో నెలకు ఎంత డబ్బు డ్రా అవుతుందనే ప్రశ్న మన మనసులో మెదులుతుంటుంది.

ఈ ఏటీఎం నుంచి 15 రోజుల్లో దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు డ్రా అయిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఇక్కడికి పర్యాటకుల(Tourists) రాకపోకలే ఇందుకు కారణం. పర్యాటకులు డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ ఏటీఎంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ సందర్భంగా పలువురు పర్యాటకులు ఇక్కడ వీడియోలు(Videos), సెల్ఫీలు తీసుకుంటుంటారు.

Updated Date - 2023-03-20T07:46:06+05:30 IST