worlds largest family: ఆ కుటుంబానికి ఒక రోజు సరిపోయే ఆహారం... సాధారణ ఫ్యామిలీకి రెండు నెలల రేషన్... ‘చానా’ సంసారం గురించి పూర్తిగా తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-20T11:58:55+05:30 IST

worlds largest family: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని నడుపుతున్న ఆ ఇంటి యజమాని పేరు జియోనా చానా(Blastema cells). మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం జియోనాకు 39 మంది భార్యలు, 90 మందికి పైగా పిల్లలు ఉన్నారు.

worlds largest family: ఆ కుటుంబానికి ఒక రోజు సరిపోయే ఆహారం... సాధారణ ఫ్యామిలీకి రెండు నెలల రేషన్... ‘చానా’ సంసారం గురించి పూర్తిగా తెలిస్తే...

worlds largest family: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని నడుపుతున్న ఆ ఇంటి యజమాని పేరు జియోనా చానా(Blastema cells). మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం జియోనాకు 39 మంది భార్యలు, 90 మందికి పైగా పిల్లలు ఉన్నారు. జియోనాకు 30 మందికి పైగా మనుమలు(grandchildren) ఉన్నారు. మొత్తంగా చూస్తే జియోనా చానా కుటుంబంలో 180కి పైగా కుటుంబ సభ్యులు ఉన్నారు. జియోనా చానా మిజోరం(Mizoram)లోని బట్వాంగ్ గ్రామంలోని ఒక పెద్ద ఇంట్లో ఉమ్మడి కుటుంబం(joint family)తో నివసిస్తున్నారు.

జియోనా చానా ఇంట్లో మొత్తం 100 గదులు ఉన్నాయి. అతని కొడుకులతో పాటు, జియోనా చానా కార్పెంటర్‌(Carpenter) పనులు చేస్తుంటాడు. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం అయిన ఈ ఫ్యామిలీకి అతి పెద్ద వంటగది కూడా ఉంది. ఇందులో కుటుంబ సభ్యులందరికీ సరిపోయే ఆహారం తయారు చేస్తారు. ఈ కుటుంబానికి చెందిన మహిళలు ఉదయం నుండే ఆహారాన్ని తయారు చేయడం ప్రారంభిస్తారు.

రోజుకు 25 కిలోల పప్పులు, 45 కిలోల బియ్యం(45 kg of rice), 30 నుండి 40 కోళ్లు, 60 కిలోల కూరగాయలు, డజన్ల కొద్దీ గుడ్లు ఆహారం కోసం వినియోగిస్తారు. జియోనా చానా కుటుంబం రోజుకు 20 కిలోల పండ్లను తీసుకుంటుంది. జియోనా చానా కుటుంబం ఒక రోజు(one day) తీసుకునే ఆహారం.. ఒక సాధారణ కుటుంబం రెండు నెలల పాటు జీవించేందుకు సరిపోతుంది. మిజోరంలో ఎప్పుడు ఎన్నికలు(Elections) జరిగినా ఈ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కుటుంబం ఏ పార్టీకి ఓటు(vote) వేసినా గెలుపు దాదాపు ఖాయమనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది.

Updated Date - 2023-03-20T12:18:40+05:30 IST