అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నది... పొరపాటున దానిలో కాలు పెట్టినా... అంతే సంగతులు...!

ABN , First Publish Date - 2023-05-01T07:41:01+05:30 IST

నదులు మనిషికి ప్రాణాధారమని భావిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ఒక నది ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనదిగా(Most dangerous) పేరొందింది. ఆ నదికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నది... పొరపాటున దానిలో కాలు పెట్టినా... అంతే సంగతులు...!

నదులు మనిషికి ప్రాణాధారమని భావిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ఒక నది ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనదిగా(Most dangerous) పేరొందింది. ఆ నదికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విచిత్రమైన నది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్లో ప్రవహిస్తుంది. దీని పేరు షానయ్-టింపిష్కా(Shanay-Timpishka), దీనిని లా బొంబా అని కూడా పిలుస్తారు.

ఈ నదిలోని నీరు ఎంత వేడిగా ఉంటుందంటే ఏ ప్రాణి అయినా అందులో పడితే వెంటనే చనిపోవాల్సిందే. 6.4 కిలోమీటర్ల పొడవు, 82 అడుగుల వెడల్పు, దాదాపు 20 అడుగుల లోతున్న ఈ నదిని 2011లో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోని ఏకైక ఉడుకుతున్న నది(Boiling River) అని కూడా పిలుస్తారు. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆండ్రీస్ రుజో అనే యువకుడు తన తాత చెప్పిన కథ విని, అనంతరం తన పరిశోధనతో ఈ నదిని కనుగొన్నాడు.

ఆండ్రీస్ రుజో(Andries Ruzo) ఆ నదిని కనుగొనడానికి బయలుదేరినప్పుడు చుట్టుపక్కల జనం అతనిని ఎగతాళి చేశారు. అలాంటి నది ఎక్కడా ఉండదని ఆయనకు చెప్పారు. కానీ రుజో వారి మాటలను పట్టించుకోలేదు. ఎలాగోలా ఆ నదిని కనుగొన్నాడు. ఈ నదిలోని నీరు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో(temperature) ఉడుకుతుందని చెబుతారు. అంటే పొరపాటున ఈ నదిలో పడిపోతే మరణం ఖాయం అని చెప్పవచ్చు.

ఆండ్రీస్ తన పుస్తకం ‘ది బాయిలింగ్ రివర్: అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ది అమెజాన్‌’('The Boiling River: Adventure and Discovery in the Amazon')లో ఈ నదిలోని నీరు వేడి నీటి బుగ్గ నుండి బయటకు ఉబికి వస్తుందని, అందుకే అది చాలా వేడిగా ఉంటుందని తెలిపాడు. ఈ నది నీరు ఎంత వేడిగా ఉంటుందంటే ఈ నీటితో క్షణాల్లో టీ(tea) తయారు చేసుకోవచ్చు.

Updated Date - 2023-05-01T07:52:24+05:30 IST