electronic bandage: గాయాలను వేగంగా మాయం చేసే వినూత్న బ్యాండ్ ఎయిడ్... ఎలా పనిచేస్తుందంటే...

ABN , First Publish Date - 2023-03-19T12:42:48+05:30 IST

electronic bandage: సాధారణ బ్యాండేజీల కంటే 30 శాతం వేగంగా గాయాలను నయం చేయగల బ్యాండేజీ(bandage)ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇది ఎలక్ట్రానిక్ బ్యాండ్-ఎయిడ్. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

electronic bandage: గాయాలను వేగంగా మాయం చేసే వినూత్న బ్యాండ్ ఎయిడ్... ఎలా పనిచేస్తుందంటే...

electronic bandage: సాధారణ బ్యాండేజీల కంటే 30 శాతం వేగంగా గాయాలను నయం చేయగల బ్యాండేజీ(bandage)ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇది ఎలక్ట్రానిక్ బ్యాండ్-ఎయిడ్. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక రకమైన స్మార్ట్ బ్యాండ్-ఎయిడ్. నిజానికి గాయం నయం అయినప్పుడు ఆ భాగం చర్మంలో కలిసిపోతుంది. ఈ బ్యాండ్-ఎయిడ్‌ 30 నిమిషాల్లో దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది.

ఈ బ్యాండ్-ఎయిడ్‌ను సిద్ధం చేసిన నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా(Northwestern University of America) పరిశోధకులు ఈ కొత్త స్మార్ట్ బ్యాండ్-ఎయిడ్ ఎంతో అనువైనదని చెప్పారు. దీనిలో ఎలక్ట్రోడ్లు(Electrodes) ఉంటాయన్నారు. దీనిలో బ్యాటరీతో సెన్సార్లను కూడా అమర్చామన్నారు. ఇది గాయాన్ని నయం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు శరీరంలోని విద్యుత్ సంకేతాలు(Electrical signals) చెదిరిపోతాయి. ఈ బ్యాండ్-ఎయిడ్ ఆ విద్యుత్ సంకేతాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపకరిస్తుంది.

గాయాన్ని మాన్పించే క్రమంలో కణాలు నిరంతరం కదులుతున్నట్లు పరిశోధన(Research)లో గమనించామని గిల్లెర్మో అమీర్ అనే పరిశోధకుడు తెలిపారు. మన శరీరంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నడుస్తాయి. ఈ కొత్త పరికరం ఎలక్ట్రికల్ సిగ్నల్‌(Electrical signal)ను పెంచడానికి పనిచేస్తుంది, తద్వారా గాయం త్వరగా మానుతుంది. ఈ బ్యాండేజ్‌ని ఎలక్ట్రోడ్ మాలిబ్డినం మెటల్‌(Molybdenum metal)తో తయారు చేశామని పరిశోధకులు తెలిపారు.

ఇది గాయాన్ని నయం చేసిన తర్వాత అక్కడి చర్మం నెమ్మదిగా మిగిలిన చర్మం(skin)లో కలిసిపోతుంది. ఈ బ్యాండ్ ఎయిడ్‌ను డయాబెటిక్, అల్సర్ రోగులపై ఈ పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు(Scientists) సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-03-19T12:49:33+05:30 IST