Viral: కాంటాక్ట్ లెన్స్ వాడతారా? డాక్టరయ్యాక నేను తెలుసుకున్నది ఇదేనంటూ ఇతడు చెప్పేది వింటే..

ABN , First Publish Date - 2023-07-27T21:40:24+05:30 IST

కాంటాక్ట్ లెన్స్‌తో వచ్చే సమస్యల గురించి డాక్టర్ అయ్యాకే పరిపూర్ణ అవగాహన కలిగిందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. కుదిరితే కాంటాక్ట్స్‌ను అస్సలు వాడనని చెప్పుకొచ్చారు. వీటిని ఇష్టారీతిన వాడిన ఓ మహిళ చివరకు కన్నుపోగొట్టుకుందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: కాంటాక్ట్ లెన్స్ వాడతారా? డాక్టరయ్యాక నేను తెలుసుకున్నది ఇదేనంటూ ఇతడు చెప్పేది వింటే..

ఇంటర్నెట్ డెస్క్: కాంటాక్ట్ లెన్స్(Contact lens).. కళ్లద్దాలకు ప్రధాన ప్రత్యామ్నాయం. మరి మీరూ కాంటాక్ట్ లెన్స్ వాడతారా? అయితే, ఈ డాక్టర్ చెప్పేది వింటే మీ నిర్ణయం మార్చుకుంటారేమో! ఇక జన్మలో కాంటాక్ట్ లెన్స్ వాడకపోవచ్చు కూడా. కాంటాక్ట్ లెన్స్‌ గురించి నేను డాక్టర్ అయ్యాక తెలుసుకున్న విషయాలు ఇవే(Doctors adivce) అంటూ జీపీ సామ్యుయెల్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.


కాంటాక్ట్ లెన్స్ వాడే ఓ మహిళ ఎదుర్కొన్న సమస్యలను సామ్యూయెల్ తన వీడియోలో వివరించాడు. ఆమెకు స్నానం చేసేటప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ తీసేఅలవాటు లేదనిచెప్పాడు. దీంతో, ఓమారు ఆమె అకాంతమీబా ఇన్ఫెక్షన్(Acanthamoeba infection) బారిన పడింది. ఇదో పరాన్న జీవి. యాంటీబయాటిక్స్, యాంటీ వైరల్స్ దీనిపై పనిచేయవు కాబట్టి మహిళ సమస్య రాను రాను జటిలమైంది. అయిదేళ్ల పాటు ఆమె ఈ సమస్యతో పోరాడింది. క్రమంగా కంటిచూపు తగ్గిపోయింది. చివరకు ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా తొలగించేందుకు వైద్యుులు ఆమె కంటినే తొలగించాల్సి వచ్చిందని వివరించాడు(Eye removed). నిరంతరం కాంటాక్ట్స్ వాడటంతో వాటి కింద నీరు పేరుకుపోయి అంకాతమీబా ఇన్ఫెక్షన్ మొదలైందని చెప్పుకొచ్చాడు.


వీలైతే కాంటాక్ట్ లెన్స్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. కాంటాక్ట్ లెన్స్ వాడకూడదని డాక్టర్ అయ్యాక తనకు తెలిసిందన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని పెట్టుకోవాల్సి వస్తే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నాడు. కాంటాక్ట్స్‌ను తాకేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అధీకృత సొల్యూషన్సే వాడాలని, తరచూ లెన్స్‌ను మారుస్తుండాలని సూచించాడు.

Updated Date - 2023-07-27T21:42:30+05:30 IST