Zomato Delivery Boy: ప్రతీ ఆర్డర్‌కు సొంత డబ్బుతో ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ జొమాటో డెలివరీ బాయ్ ఎందుకిలా చేస్తున్నాడంటే..!

ABN , First Publish Date - 2023-06-30T17:17:13+05:30 IST

ఆ యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆ యువకుడు తన 30వ పుట్టిన రోజుని రొటీన్ కు భిన్నంగా జరుపుకున్నాడు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముందుగా ష‌ర్ట్ కొనుక్కుని వేసుకున్నాడు. ఆ తర్వాత డ్యూటీకి వెళ్లి వెరైటీగా బర్త్‌డే జరుపుకున్నాడు.

Zomato Delivery Boy: ప్రతీ ఆర్డర్‌కు సొంత డబ్బుతో ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ జొమాటో డెలివరీ బాయ్ ఎందుకిలా చేస్తున్నాడంటే..!

ఆ యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌ (Zomato Delivery Boy)గా పని చేస్తున్నాడు. ఆ యువకుడు తన 30వ పుట్టిన రోజుని (Birth Day) రొటీన్ కు భిన్నంగా జరుపుకున్నాడు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముందుగా ష‌ర్ట్ కొనుక్కుని వేసుకున్నాడు. ఆ తర్వాత డ్యూటీకి వెళ్లి వెరైటీగా బర్త్‌డే జరుపుకున్నాడు. ఆ రోజు తాను ఫుడ్ డెలివ‌రీ చేసిన క‌స్ట‌మ‌ర్లంద‌రికీ చాక్లెట్లు (Chocolates) అందించి త‌న సంతోషాన్ని వారితో పంచుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ యువకుడి ఆలోచనను నెటిజన్లు అభినందిస్తున్నారు.

క‌ర‌ణ్ ఆప్టే (30) అనే యువకుడు ఇటీవల తన 30వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. తన పుట్టిన రోజు నాడు క‌ర‌ణ్ త‌న‌కు ప‌రిచ‌యం లేనివారికి సైతం చాక్లెట్లు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ రోజు తను ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్లందరికీ ఓ ఫైవ్‌స్టార్ చాక్లెట్‌ను అందించాడు. ప్రతీ డెలివరీ ప్యాక్‌కు చాక్లెట్ స్టిక్ చేసి ఇచ్చి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Viral Video: ప్రేయసి కూర్చుంది కదా అని రెచ్చిపోయిన ప్రియుడు.. సడన్‌గా బైక్‌ను గాల్లోకి లేపాడు కానీ.. మరుక్షణమే షాకింగ్ సీన్..!

నెటిజన్లు కరణ్ ఆలోచనను మెచ్చుకున్నారు. మంచి మనసు ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయని అభినందించారు. జొమాటో సంస్థ కూడా కరణ్‌ను అభినందించింది. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ కేక్ పంపించింది. కేక్ పంపించినందుకు జొమాటో సంస్థకు కరణ్ ధన్యవాదాలు తెలిపాడు.

Updated Date - 2023-06-30T17:17:13+05:30 IST